5 రాష్ట్రాల ఎన్నికలపై కాంగ్రెస్ ఫోకస్.. నేడు హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశం..

5 రాష్ట్రాల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ నేడు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశం నిర్వహిస్తోంది. దీనికి ఆ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, ముఖ్య నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ హాజరుకానున్నారు. ఇందులో పలు కీలక అంశాలను చర్చించనున్నారు.

Congress focus on 5 state elections.. CWC meeting in Hyderabad today..ISR

మరి కొన్ని నెలల్లో ఐదు రాష్ట్రాల జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నేడు తెలంగాణ రాష్ట్ర రాజధానిలో సమావేశం కానుంది. హైదరాబాద్ లో మూడు రోజుల పాటు జరిగే ఈ కీలక సమావేశం తెలంగాణలో పార్టీ ప్రచారాన్ని మరింత ఉధృతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆ పార్టీ వర్గాలు ‘ఎన్డీటీవీ’తో తెలిపాయి.

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సీడబ్ల్యూసీ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాలు చర్చించున్నారు. అలాగే ‘భారత్ జోడో యాత్ర 2’నిర్వహణపై కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే సోమవారం హైదరాబాద్ లో పార్టీ భారీ ర్యాలీ నిర్వహించనుంది. 

కాగా.. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్న తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరం రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ధీమా వ్యక్తం చేశారు. సోమవారం హైదరాబాద్ లో పార్టీ భారీ ర్యాలీ నిర్వహించి, తెలంగాణ ప్రజలకు ఆరు హామీలు ప్రకటిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేష్ అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు పార్టీకి ప్రజల నుంచి స్పష్టమైన తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు. 

సీడబ్ల్యూసీ సమావేశం చారిత్రాత్మకమని, ఇది తెలంగాణ రాజకీయాల్లో పరివర్తన చెందుతుందని ఆయన అన్నారు. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన ఆయన.. మోడీ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు అనే విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని కోరారు. వాళ్లిద్దరి మధ్యా తేడా లేదని తెలిపారు. ఢిల్లీలో నరేంద్ర మోడీ ఉన్నారని, హైదరాబాద్ లో కేసీఆర్ ఉన్నారని చెప్పారు.

కాగా.. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీని పునర్వ్యవస్థీకరించిన అధిష్టానం.. గత నెలలో కీలక మార్పలు చేసింది. మల్లికార్జున ఖర్గే పార్టీ చీఫ్ అయిన 10 నెలల తర్వాత ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఇందులో 39 మంది రెగ్యులర్ సభ్యులు, 32 మంది శాశ్వత ఆహ్వానితులు, 13 మంది ప్రత్యేక ఆహ్వానితులు ఉన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios