సంగారెడ్డి: సంగారెడ్డి ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసారి తనను ఓడిస్తే మళ్లీ పోటీ చెయ్యడానికి ఓపిక లేదంటూ ప్రకటించారు. తన హయాంలో జరిగిన అభివృద్ధిని చూసి ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
 
సంగారెడ్డి నియోజకవర్గానికి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఏం చేశారో చెప్పాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. నా పేరు చెబితే చాలు పనులవుతాయని అదీ తన పవర్ అంటూ సంగారెడ్డి చెప్పుకొచ్చారు. సంగారెడ్డికి రావాల్సిన మెడికల్ కాలేజీని మంత్రి హరీష్ రావు సిద్దిపేటకు తీసుకెళ్లిపోయాడని విమర్శించారు. 

చిరు వ్యాపారులను దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న మోడీ విధానాలకు కేసీఆర్ మద్దతు పలుకుతున్నారని ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. ప్రజలకు న్యాయం జరగాలంటే అది ఒక్కకాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని తెలిపారు.