హైదరాబాద్: టీఆర్ ఎస్ పార్టీతో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కు అయ్యిందన్న అనుమానం వ్యక్తమవుతుందని గజ్వేల కాంగ్రెస్ అభ్యర్థి వంటేరు ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. ఈవీఎంల టాంపరింగ్ కు పాల్పడుతున్నారని అనుమానం వ్యక్తం చేశారు. 

గతంలో టీఆర్ఎస్ నేత కేటీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లలో విజయకేతనం ఎగురవేస్తామని చెప్పిన ఆయన ఇప్పుడు 106 సీట్లలో గెలుస్తామని చెప్పడం వెనుక ఏదో మతలబు ఉందన్నారు. వీవీప్యాట్లలోని స్లిప్ లను కౌంట్ చెయాలని ఈసీని కోరుతున్నట్లు తెలిపారు. 

అవసరమైతే ఈ అంశంపై హైకోర్టుకు కూడా వెళ్తానన్నారు. టీఆర్ఎస్ తో ఎలక్షన్ కమిషన్ కుమ్మక్కు అయినట్లు తమకు అనుమానం ఉందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల అపోహలను ఈసీ తొలగించాలని డిమాండ్ చేశారు.