ఓడిపోతాననే భయంతో ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన నిజామాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ నగరంలోని రోటరీ నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఓ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం రేపుతోంది. 

సిరికొండ మండలం తాళ్లరామడుగు గ్రామానికి చెందిన దాసరి గణేష్ అనే వ్యక్తి.. కాంగ్రెస్ పార్టీ తరుపున ఎంపీటీసీ అభ్యర్థిగా పోటీ చేశాడు. ఫలితాల కోసం నిరీక్షిస్తుండగా.. ఓడిపోతాడంటూ ప్రచారం జరగడంతో గణేష్ మనోవేదనకు గురయ్యాడు. దీంతో మనస్తాపంతో ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు.