సారాంశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై  పార్టీలు కసరత్తు చేస్తుంది.   ఈ నెల  16న  బీఆర్ఎస్ మేనిఫెస్టోను విడుదల చేయనుంది.  కాంగ్రెస్, బీజేపీలు కూడ త్వరలోనే  మేనిఫెస్టోలను విడుదల చేయనున్నాయి.


హైదరాబాద్: ఈ నెల  16న  ఎన్నికల మేనిఫెస్టోను బీఆర్ఎస్ విడుదల చేయనుంది. మేనిఫెస్టోలపై  కాంగ్రెస్, బీజేపీలు కసరత్తు చేస్తున్నాయి.  కాంగ్రెస్ పార్టీ ఈ నెల  15వ తేదీకి ముందే  మేనిఫెస్టోను విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. బీజేపీ కూడ  మేనిఫెస్టోపై  కసరత్తు చేస్తుంది.

ప్రస్తుతం అమలు చేస్తున్న  సంక్షేమ పథకాలతో పాటు మరిన్ని  పథకాలపై  బీఆర్ఎస్  ప్రకటించనుంది.  మహిళలపై బీఆర్ఎస్ నాయకత్వం వరాలు కురిపించే అవకాశం ఉంది.  ప్రస్తుతం అమలు చేస్తున్న  రైతు బంధు, పెన్షన్లను పెంచే అవకాశం ఉంది. తమ పార్టీ ప్రకటించే మేనిఫెస్టో‌తో  కాంగ్రెస్, బీజేపీల మతిపోయే అవకాశం ఉందని  బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తున్నారు.  ఎన్నికల మేనిఫెస్టోకు  బీఆర్ఎస్ నాయకత్వం తుది మెరుగులు దిద్దుతుంది. 

ఎన్నికల మేనిఫెస్టో‌పై కాంగ్రెస్ పార్టీ  ముమ్మరంగా కసరత్తు చేస్తుంది. ఎన్నికల మేనిఫెస్టో కమిటీ  జిల్లాల వారీగా పర్యటనలు చేస్తుంది.క్షేత్ర స్థాయి నుండి ప్రజల నుండి వచ్చిన సలహాలు, సూచనలను  మేనిఫెస్టోలో  చేర్చనున్నారు. ఆరు హామీలతో పాటు ఇతర అంశాలను  కూడ మేనిఫెస్టో‌లో చేర్చనుంది కాంగ్రెస్ పార్టీ.  మేనిఫెస్టో‌లో చేర్చాల్సిన అంశాలపై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ తుది మెరుగులు దిద్దుతుంది.  శ్రీధర్ బాబు నేతృత్వంలోని మేనిఫెస్టో కమిటీ  మేనిఫెస్టో లో చేర్చాల్సిన అంశాలపై  చర్చిస్తుంది. సోషల్ డెమోక్రటిక్ ఫోరం , రిటైర్డ్  ఐఎఎస్ అధికారి ఆకునూరి మురళితో శ్రీధర్ బాబు నేతృత్వంలోని  కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ  చర్చలు జరిపింది. మేనిఫెస్టోలో  చేర్చాల్సిన అంశాలపై  సలహాలు, సూచలను స్వీకరించింది. 

మరో వైపు బీజేపీ కూడ  మేనిఫెస్టో పై కసరత్తు చేస్తుంది. ఈ నెల 5, 6 తేదీల్లో బీజేపీ కీలక సమావేశాలు  జరిగాయి. ఈ నెల  5వ తేదీన  బీజేపీ రాష్ట్ర పదాధికారుల సమావేశం జరిగింది. ఈ నెల 6న రాష్ట్ర కౌన్సిల్ సమావేశం  జరిగింది.  ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు హాజరయ్యారు. ఈ నెల ఐదో తేదీన  14 ఎన్నికల కమిటీలను బీజేపీ ప్రకటించింది. మేనిఫెస్టో పై కసరత్తు చేస్తుంది.

also read:ఈ నెల 15 నుండి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర: ప్రియాంక, రాహుల్ పాల్గొనేలా ప్లాన్

ఈ నెల మొదటి వారంలో  సీఈసీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం  రాష్ట్రంలో పర్యటించింది.  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల  సన్నద్దతపై  చర్చించింది.  త్వరలోనే  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై  ఈసీ  షెడ్యూల్ ను  ప్రకటించే అవకాశం ఉంది.