తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన మరుక్షణం నుంచే రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. తాజాగా ఆయన హుజూరాబాద్ శానససభ నియోజకవర్గం ఉప ఎన్నికలపై దృష్టి సారించారు.

హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవిని చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి దూకుడు ప్రదర్శిస్తున్నారు. పార్టీలోకి పాత కాంగ్రెసు నాయకులను తిరిగి ఆహ్వానిస్తుండడమే కాకుండా హుజూరాబాద్ శాసనసభ నయోజకవర్గం ఉప ఎన్నికపై కూడా దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా కాంగ్రెసు పార్టీ హుజూరాబాద్ శానససభా నియోజకవర్గంలోని మండలాలకు ఇంచార్జీలను నియమించింది.

హుజారాబాద్ అసెంబ్లీ ఇంచార్జీగా మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యవహరిస్తారు. నియోజకవర్గం ఎన్నికల సమన్వయకర్తలుగా జీవన్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వ్యవహరిస్తారు. మండల ఇంచార్జీలను కూడా నియమించారు. మండల ఇంచార్జీలుగా నియమితులైనవారిలో మాజీ మంత్రి కొండా సురేఖ కూడా ఉన్నారు. ఆమె కమలాపూర్ మండలం ఇంచార్జీగా నియమితులయ్యారు.

మండల ఇంచార్జీల జాబితా ఇలా ఉంది...

వీణవంక మండలం.. 
ఆది శ్రీనివాస్, సింగీతం శ్రీనివాస్..

జమ్మికుంట మండలం.. 
విజయ రమణ రావ్, రాజ్ ఠాగూర్

హుజురాబాద్ మండలం.. 
టి. నర్సారెడ్డి, లక్షన్ కుమార్..

హుజురాబాద్ టౌన్.. 
బొమ్మ శ్రీరాం, జువ్వాడి నర్సింగరావు

ఇల్లంతకుంటా మండలం.. 
నాయిని రాజేందర్ రెడ్డి, కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

కమలపూర్ మండలం.. 
కొండా సురేఖ, దొమ్మటి సాంబయ్య..

కంట్రోల్ రూమ్ సమన్వయ కర్త ..
కవ్వంపల్లి సత్యనారాయణ..

కాగా, తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఈ రోజు బుధవారం ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన తెలంగాణ కాంగ్రెసు ఇంచార్జీ మాణిక్యం ఠాగూర్ తో పాటు ఇతర అధిష్టానం పెద్దలను కలుసుకునే అవకాశం ఉంది. వారితో కాంగ్రెసులో చేరబోయే నాయకుల గురించి చర్చించే అవకాశం ఉంది.