Munugode bypoll 2022: ఏడు మండలాలకు కీలక నేతలకు కాంగ్రెస్ బాధ్యతలు

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో తన పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ భావిస్తుంది.ఈ మేరకు ఏడు మండలాలకు కీలక నేతలకు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ బాధ్యతలను అప్పగించింది. 

Congress Appoints Mandal Incharges For Munugode bypoll 2022

నల్గొండ: మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికను పురస్కరించుకొని  తన పట్టును నిలుపుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ అడుగులు వేస్తుంది. మండలాల వారీగా కీలక నేతలకు  కాంగ్రెస్ పార్టీ  బాధ్యతలను అప్పగించింది. చౌటుప్పల్ మండలానికి దామోదర్ రెడ్డి , నాయిని రాజేందర్, నారాయణపూర్ మండటానికి బలరామ్ నాయక్, గండ్రసత్యనారాయణ, మునుగడు మండలానికి సీతక్క, విజయరమణరావు, నాంపల్లి మండలానికి అంజన్ కుమార్ యాదవ్, మల్లు రవి, గట్టుప్పల్ సంపత్ కుమార్, ఆది శ్రీనివాస్, చండూరు మండలానికి ఎర్రావతి అనిల్, వంశీకృష, మర్రిగూడ మండలానికి చెరుకు సుధాకర్, వేం నరేందర్ రెడ్డిలను  ఇంచార్జీలుగా నియమించారు. 

మునుగోడు ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  ఈ నెల 8వ  తేదీన రాజీనామా చేశారు.  ఈ రాజీనామాను స్పీకర్ ఆమోదించారు.దీంతో   ఈ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఆరు మాసాల్లోపుగా ఈ స్థానానికి ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అనివార్య పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో  ఈ స్థానంలో తన పట్టును నిలుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది.  దీంతో మంటలాల వారీగా కీలక నేతలకు బాధ్యతలను అప్పగించింది. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని ఏడు మండలాలకు ఇద్దరేసి చొప్పున నేతలకు బాధ్యతలను అప్పగించింది కాంగ్రెస్ పార్టీ.

ఈ నియోజకవర్గంలో తన పట్టును నిలుపుకొనేందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుండి ప్రయత్నాలను ప్రారంభించింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ క్యాడర్ వెళ్లకుండా ఉండేందుకు గాను కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకొంటుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా నిలిచిన నాలుగు మండలాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులపై సస్పెన్షన్ వేటేసింది ఆ పార్టీ. ఏడు మండలాల్లోని ప్రతి గ్రామంలో పార్టీ క్యాడర్ చెదిరిపోకుండా ఉండేందుకు గాను కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ముందు జాగ్రత్తలు తీసుకొంటుంది. 

మునుగోడు అసెంబ్లీ స్థానానికి 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.  ఆ తర్వాత చోటు చేసుకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గుడ్ బై చెప్పారు.ఈ నెల 2వ తేదీన కాంగ్రెస్ పార్టికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.  ఆ తర్వాత మూడు రోజులకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టుగా సోనియా గాంధీకి రాజీనామా లేఖను పంపారు.ఈ నెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు.  చౌటుప్పల్ లో నిర్వహించనున్న సభలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ తీర్థం పుచ్చుకొంటారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios