హైదరాబాద్: రాష్ట్రంలో మూడు జిల్లాల్లో జరిగే స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.

నల్గొండ, వరంగల్, రంగారెడ్డి  జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ  స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.ఈ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఈ నెల 14 వ తేదీ లోపుగా నామినేషన్లు దాఖలు చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఆదివారం నాడు సుదీర్ఘంగా కసరత్తు నిర్వహించింది.

నల్గొండ స్థానానికి కోమటిరెడ్డి లక్ష్మీరెడ్డి, రంగారెడ్డి స్థానానికి ఉదయ మోహన్ రెడ్డి, వరంగల్ స్థానానికి ఇనుగుల వెంకట్రామిరెడ్డి పోటీ చేయనున్నారు. ఈ మేరకు సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఈ పేర్లను ప్రకటించింది.