హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ కు కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి స్థానం లేదని ఆయన స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీని ఒక్క డివిజన్లో కూడ గెలవనివ్వబోమన్నారు.బీజేపీని తెలంగాణ నుండి పీకి పడేస్తామన్నారు. ట్విట్టర్ వేదికగా రేవంత్ రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

డిసెంబర్ 1వ తేదీన జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికలను ప్రధాన పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నాయి.ఈ ఎన్నికల్లో మరోసారి జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ భావిస్తోంది.  కాంగ్రెస్ పార్టీ కూడ ఈ ఎన్నికల్లో తన సత్తాను చాటాలని తలపెట్టింది.

అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతల మధ్య సమన్వయం లేకుండాపోయింది. పార్టీ నేతల మధ్య  మాటల యుద్దం సాగుతుంది. ఈ అవకాశాన్ని ప్రత్యర్ధులు తమకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. కనీసం డిపాజిట్ కూడ దక్కలేదు. దీంతో జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఆ పార్టీ మరింత కేంద్రీకరించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో ఆ పార్టీకి ఆశించిన ఫలితాలు దక్కలేదు.