పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద సరస్వతి పంప్‌ హౌస్‌ పైపులైన్‌ వద్ద భూమి కుంగిపోయింది. దీంతో పార్వతి బ్యారేజ్‌లోకి నీటిని ఎత్తిపోసే పనులకు అంతరాయం ఏర్పడింది. వర్షానికి నీరు చేరి పైప్‌లైన్‌ పైకి వచ్చింది. 

పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు వద్ద సరస్వతి పంప్‌ హౌస్‌ పైపులైన్‌ వద్ద భూమి కుంగిపోయింది. దీంతో పార్వతి బ్యారేజ్‌లోకి నీటిని ఎత్తిపోసే పనులకు అంతరాయం ఏర్పడింది. వర్షానికి నీరు చేరి పైప్‌లైన్‌ పైకి వచ్చింది. స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన అధికారులు ఎత్తిపోతలకు అంతరాయం ఏర్పడటంతో మరమ్మతులు చేపట్టారు. ఈ నెల 17 నుంచి సరస్వతి పంప్‌హౌస్‌ నుంచి పార్వతి బ్యారేజ్‌లోకి నీటిని ఎత్తిపోస్తున్నారు. మొత్తం 12 మోటార్లకు గాను 6 మోటార్లను విడతల వారీగా నడిపిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం 20 టీఎంసీల నీటిని పార్వతీ బ్యారేజ్‌లోకి ఎత్తి పోశారు. సరస్వతి పంప్‌హౌస్‌లో 5 మోటార్ల ద్వారా 14,650 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. పార్వతి బ్యారేజ్‌ పూర్తి సామర్థ్యం 8.80 టీఎంసీలుకాగా ప్రస్తుతం 5.94 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.