తెలంగాణ సిఎం భాషపై కమ్యూనిస్టు కౌంటర్ నా కొడుకులు ఏడున్నరో చెప్పిన కమ్యూనిస్టు  

కమ్యునిస్టు నా కొడుకులు యాడున్నారా?
చెప్తా ....... ఆలకించు కెసీఆర్ సాబ్.

తరాల నుంచి మాయల ముంచి
మా తాతముత్తాల రక్తం మీరెట్ల 
కాజేస్తుంన్రో చెప్పిన కాడున్నరు ........

నా కొడుకులు ఏడున్నారా ?
ఆసాములు భూసాములు
మదమెక్కిన సామంతులు
మా అయ్య రెక్కల కష్టం
ఎట్ల మెక్కిరో చెప్పినకాడున్నరు.....

నా కొడుకులు యాడున్నారా 
గిరగిర తిరిగే మిల్లుల నడుమ
నడుములు నలిగిలా
నా యమ్మ శ్రమను
నీ తాతలెట్ల దోచుకున్నరో
తెలిపినకాడున్నరు.......

నా కొడుకులు యాడున్నారా
పీకలు కోస్తూ
గోతులు తీస్తూ
పిల్లాపాపలను సైతం
జాతి పేరున చంపుతున్న
నర హంతక నాజీ మూకలను మట్టుబెట్టిన కాడున్నరు

నా కొడుకులు యాడున్నారా
ఆడతల్లుల మానలలో
తొండలు దూర్చి
నా అక్కచెల్లెళ్ళ బట్టలూడదీసి బతుకమ్మ లాడించిన నా కొడుకు నిజాం పంచలూడదీసిన కాడున్నరు

(సోషల్ మీడియా నుంచి)