కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శించేందుకు వరంగల్ అర్బన్ జిల్లా నుంచి బయలుదేరిన కలెక్టర్లు మేడిగడ్డ బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆధ్వర్యంలో పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన బస్సులో జిల్లా కలెక్టర్లు బయలుదేరి వెళ్లారు.

ముందుగా మేడిగడ్డ బ్యారేజ్ క్యాంపు కార్యాలయానికి చేరుకుని.. అనంతరం శ్రీకాళేశ్వర ముక్తీశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.

మధ్యాహ్నం కన్నేపల్లి లక్ష్మీపంప్ హౌస్‌ను సందర్శించి అనంతరం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం భూగర్భ పంప్‌హౌస్‌ను సందర్శించనున్నారు. సాయంత్రం తిరిగి వారి వారి జిల్లాలకు వెళ్లనున్నారు. కలెక్టర్ల పర్యటన దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్ట్ పరిసరాల్లో  భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.