వరంగల్‌లో భారీ వర్షాలు, అధికారులను అప్రమత్తం చేసిన ఆమ్రపాలి (వీడియో)

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 20, Aug 2018, 1:10 PM IST
collector amrapali meeting on heavy rains in warangal
Highlights

వరంగల్ జిల్లాలో కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులకు కలెక్టర్ ఆమ్రపాలి ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చూడాలని సూచించారు. ఇక రానున్న రోజుల్లో కురిసే వర్షాలపై కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటికే నగరంలో లోతట్టు ప్రాంతాలు, చెరువుల శిఖం మూముల్లో వెలిసిన నిర్మాణ ప్రాంతాలను గుర్తించినట్లు ఆమ్రపాలి తెలిపారు. అలాంటి ప్రాంతాలపై ముఖ్యంగా దృష్టి పెట్టినట్లు ఆమ్రపాలి వివరించారు.  

ఇవాళ కలెక్టరేట్ లో ఆమ్రపాలి మాట్లాడుతూ... పరిశుభ్రత విషయంలో జిల్లా ప్రజల సహకారం చాలా బావుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ 2018 లో వరంగల్ జిల్లాను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ప్రజల సహకారం మరింత అవసరమని అన్నారు.  జిల్లాలో 100 శాతం మరుగుదొడ్లను నిర్మించడం జరిగిందని తెలిపిన ఆమె ప్రతి ఒక్కరు వాటిని వినియోగించుకునేలా చూడాలని సూచించారు. 

ఇక పక్క రాష్ట్రం కేరళ కు సాయం చేయడానికి జిల్లా ప్రజలు ముందుకు రావాలని ఆమె సూచించారు. కేరళ భాదితుల కోసం తగిన విధంగా తమ సాయాన్ని ప్రకటించాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.

వీడియో

"

loader