ఎన్నికల్లో ముఖ్యమంత్రుల తనయులు, పుత్రికల ఓటమి హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కవిత నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓడారు. 

కర్ణాటక ముఖ్యమంత్రి నిఖిల్ గౌడ మాండ్య నియోజకవర్గంలో సుమలత చేతిలో ఓటమిపాలయ్యారు. 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు  నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేయగా ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణ రెడ్డి కి పోటీని ఇవ్వలేక ఓటమి చెందారు. 

రాజస్థాన్ సీఎం అశోక్ గేహలాట్ తనయుడు వైభవ్ జోధ్ పుర్ నుంచి పోటీ చేయగా బీజేపీ అభ్యర్థి గజేంద్ర సింగ్ చేతిలో ఓటమిని చూశారు.  

కేవలం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ కుమారుడు నకుల్ నాథ్ మాత్రమే ఈ లిస్ట్ లో విజయాన్ని అందుకున్నారు. మినహా మిగతా ముఖ్యమంత్రుల వారసులు ఈ ఎన్నికల్లో ఓటమి చెందారు.