ఏలూరులో అంతు చిక్కని వ్యాధిపై ఏపీ సీఎం వైఎస్ జగన్ సమీక్ష నిర్వహిస్తున్నారు. బుధవారం జిల్లా కలెక్టర్, వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు జగన్.

కేసుల వివరాలను ఆయన ఆరా తీశారు, అలాగే రోగులకు అందిస్తున్న చికిత్సపైనా అడిగి తెలుసుకున్నారు. మరోవైపు మళ్లీ కొత్త కేసులు నమోదు కావడం , ఆందోళన కలిగిస్తోంది.

తంగెళ్లమూడి, తూర్పువీధి, పడమట వీధి, శంకరమఠం ప్రాంతాల నుంచి ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య రోజు రోజుకి ఎక్కువవుతోంది. వీరిలో కొందరికి ఒకేసారి ఫిట్స్‌లా వచ్చిందని బంధువులు చెబుతున్నారు.

Also Read:ఏలూరులో అంతు చిక్కని వ్యాధి: జగన్ కు చంద్రబాబు లేఖ

అంతుచిక్కని వ్యాధికి సంబంధించి ఎయిమ్స్ నివేదిక కీలకంగా మారింది. ఇప్పటికే రెండు సార్లు సేకరించిన శాంపిల్స్‌లో నికెల్, సీసం లోహాలు వున్నట్లు గుర్తించారు. మూడోసారి 30 మంది నుంచి శాంపిల్స్ సేకరించారు.

ఇందుకు సంబంధించిన నివేదిక ఈరోజు రానుంది. శరీరంలోకి నికెల్, సీసం లోహాలు ఎలా వచ్చాయన్న కోణంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తోంది ఎయిమ్స్ బృందం. వీరితో పాటు ఎన్ఐఎన్, డబ్ల్యూహెచ్ఓ బృందం కూడా పర్యటిస్తోంది.