Revanth Reddy: నేడు ఇందిరాపార్క్ లో సీఎం రేవంత్ ధర్నా.. ఎందుకంటే..

Revanth Reddy: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌ వద్ద శుక్రవారం నాడు  ‘ఇండియా’ కూటమి ధర్నా నిర్వహించనున్నది. ఈ ధర్నాలో సీఎం రేవంత్‌ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొనే అవకాశముంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ధర్నా సాగనున్నది. అయితే.. ఈ ధర్నా ఎందుకంటే..? 

CM Revanth Reddy's protest against Parliament security violation at Indira Park on Friday KRJ

Telangana: హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద శుక్రవారం నాడు ‘ఇండియా’ కూటమి ధర్నా నిర్వహించనుంది. ఈ తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ భారీ ధర్నాలో పాల్గొనున్నది. ఈ ధర్నాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు పాల్గొననున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఈ ధర్నా సాగే అవకాశముంది. ఇంతకీ ధర్నా ఎందుకనే సందేహం వచ్చి ఉంటుందా? అయితే..ఆ విషయం తెలియాలంటే.. ఈ సోర్టీ చదవాల్సిందే. 

ఇటీవల పార్లమెంట్‌లోకి దుండగులు చొరబడి దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ దుండగులు పార్లమెంటులో కలర్ స్మోక్స్ (రంగు పొగల) దాడి చేశారు. దాడిచేసిన వారి ఉద్దేశం ఏమైనప్పటికీ జరిగింది భద్రతా వైఫల్యం అనేది అందరూ అంగీకరించే విషయమే. ఆగంతకులు సభలోకి ప్రవేశించి వీరంగం వేయడం చూసి దేశం నివ్వెరపోయింది. అయితే.. పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యాలపై ఇండియా కూటమి ఎంపీలు పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఈ ఘటనపై సమాధానం చెప్పాల్సిన కేంద్ర ప్రభుత్వం. సమాధానం చెప్పకపోగా.. దాదాపు 150 మందికిపైగా ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసింది. 

కేంద్ర ప్రభుత్వ చర్యను నిరసిస్తూ ఇండియా కూటమి దేశ వ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ పిలుపులో భాగంగా.. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ నేడు (శుక్రవారం) ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా చేపట్టనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయనున్నారు. పార్టీ అధిష్టానం పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున ధర్నా చేపట్టనున్నారు. పార్లమెంట్‌లో సెక్యూరిటీ లోపాలపై కేంద్ర ప్రభుత్వం స్పందించాలని ఇండియా కూటమి డిమాండ్ చేస్తోంది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios