మే 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో తెలంగాణ భవన్‌ను ప్రారంభించనున్నారు. బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని తెలిపారు.
ఢిల్లీలో నిర్మిస్తోన్న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. మే 4న ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీలో తెలంగాణ భవన్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్‌లో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సర్వసభ్య సమావేశంలో కేసీఆర్ ఈ విషయాన్ని తెలిపారు.
Add Asianetnews Telugu as a Preferred Source

ఇకపోతే.. ఢిల్లీలోని వసంత్ విహార్‌లో తెలంగాణ భవన్ నిర్మాణం కోసం సీఎం కేసీఆర్ గతేడాది సెప్టెంబర్ 2న శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 1100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో తెలంగాణ భవన్‌ను నిర్మిస్తున్నారు. త్రీ ప్లస్ త్రీ రీతిలో భవనాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ భవనానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. దీని ప్రారంభోత్సవానికి దేశంలోని పలు పార్టీల అధినేతలను ఆహ్వానించి.. కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు.
