Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జలాల్లో వాటాపై రాజీలేదు, పార్లమెంట్‌లో గళమెత్తుతాం:కేసీఆర్

కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా ప్రయోజనాలను కాపాడుకొనేందుకు రాజీ పడబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. మంగళవారం నాడు ఆయన ప్రగతి భవన్ లో నదీజలాలపై సుదీర్థంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదదం కొనసగుతున్న నేపథ్యంలో  ఈ సమీక్షకు ప్రాధాన్యత నెలకొంది. 

CM KCR vows to fight for Krishna water share lns
Author
Hyderabad, First Published Jul 7, 2021, 9:29 AM IST

హైదరాబాద్:కృష్ణా జలాల్లో రాష్ట్ర వాటా ప్రయోజనాలను కాపాడుకొనేందుకు రాజీ పడబోమని తెలంగాణ సీఎం కేసీఆర్ తేల్చి చెప్పారు. మంగళవారం నాడు ఆయన ప్రగతి భవన్ లో నదీజలాలపై సుదీర్థంగా సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదదం కొనసగుతున్న నేపథ్యంలో  ఈ సమీక్షకు ప్రాధాన్యత నెలకొంది. 

ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. తెలంగాణకు దక్కాల్సిన నీటి వాటా విషయమై రాష్ట్ర ప్రభుత్వం పలు దఫాల్లో అన్ని వేదికలపై కోరిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేఆర్ఎంబీ, కృష్ణా ట్రిబ్యునల్  వద్ద రాష్ట్ర ప్రభుత్వం తన వాదనను విన్పించిందని కేసీఆర్ తెలిపారు.

also read:ఆ స్థలాన్ని సందర్శించండి: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పై ఎన్జీటీకి తెలంగాణ

కృష్ణా జలాలపై రాష్ట్రం తరపున ఏ రకమైన వ్యూహన్ని అనుసరించాలనే దానిపై కేసీఆర్ అధికారులకు దిశానిర్ధేశం చేశారు. నదీజలాల్లో హక్కుగా రావాల్సిన వాటాను రాబట్టుకోవడం సహా లిఫ్టులను నడిపించేందుకు జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగించాలని కేబినెట్ లో తీసుకొన్న నిర్ణయాన్ని ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు.త్వరలోనే ప్రారంభం కానున్న పార్లమెంట్ సమావేశాల్లో  నదీజలాల్లో  రాష్ట్రానికి దక్కాల్సిన నీటి వాటా విషయంలో గళమెత్తుతామని కేసీఆర్ చెప్పారు. పార్లమెంట్ తో పాటు ఇతర వేదికల్లో కూడ తమ వాదనను కొనసాగిస్తామన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios