తెలంగాణ అసెంబ్లీ రెండవసారి కోలువుదీరనున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి చేరుకోనున్నారు.

కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల చేత ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయిస్తారు. అనంతరం స్పీకర్ ఎన్నిక జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీశ్ రావ్, ఈటల రాజేందర్, పద్మా దేవేందర్ రెడ్డి తదితరులు నివాళులర్పించారు.