తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిరోజుల్లో స్వగ్రామం చింతమడకలో పర్యటిస్తారని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై హరీశ్ రావు ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు.

గ్రామ సమస్యలపై ఆయన అధికారులతో, గ్రామప్రజలతో సమీక్ష నిర్వహిస్తారని... అనంతరం గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తారని హరీశ్ రావు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా చింతమడక గ్రామంలో ఉన్న చెరువులు , కుంటల కాలువల అనుసంధానం చేసే మ్యాప్ ను సిద్ధం చేయాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు..

సీఎం కేసీఆర్ పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేసే దిశగా అధికారులు సమాయత్తం కావాలని హరీశ్ రావు స్పష్టం చేశారు.