తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా కేసీఆర్ మూడు రోజుల పాటు ఢిల్లీలో ఉండనున్నారు. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతు నివ్వడం, దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలు.. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

హస్తిన పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి మూడు రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేయనున్నారు. ఈ పర్యటనలో పలువురు కేంద్ర మంత్రులతో పాటు విపక్ష నేతలను కలవనున్నారు. 

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా రైతు సంఘాల నేతలతో సమావేశమయ్యే అవకావం కూడా ఉంది. ఢిల్లీలో పార్టీ ఆఫీస్‌ కోసం కేంద్రం కేటాయించిన స్థలాన్ని కూడా కేసీఆర్‌ పరిశీలించనున్నారు. 

ఒకవైపు హస్తినలో రైతులు చేస్తున్న ఆందోళనకు మద్దతిస్తూనే పలువురు కేంద్ర మంత్రులను కేసీఆర్‌ కలవనుండడం ఆసక్తికరంగా మారనుంది.