Asianet News TeluguAsianet News Telugu

మీ జేబులోంచి ఇస్తున్నారా.. కేంద్రం నుంచి పైసా కూడా రావడం లేదు: అసెంబ్లీలో కేసీఆర్

తెలంగాణ అసెంబ్లీ ( telangana assembly sessions) సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై (welfare schemes) చర్చ ముగిసింది. అనంతరం ప్రతిపక్షాల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr)సమాధానం ఇచ్చారు

cm kcr speech in telangana assembly
Author
Hyderabad, First Published Oct 8, 2021, 4:39 PM IST

తెలంగాణ అసెంబ్లీ ( telangana assembly sessions) సమావేశాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై (welfare schemes) చర్చ ముగిసింది. అనంతరం ప్రతిపక్షాల ప్రశ్నలకు ముఖ్యమంత్రి కేసీఆర్ (cm kcr)సమాధానం ఇచ్చారు. ఈ మధ్య రాజకీయాల్లో చీప్ విషయాలు వింటున్నామని సీఎం అన్నారు. ప్రజలు కట్టే పన్నులను సమన్వయం చేసి వారి సంక్షేమం కోసం ఖర్చు చేయాలని ఆయన కోరారు. ప్రపంచంలో ప్రజా క్షేత్రమే అతిపెద్ద కోర్టు అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ 32 జడ్పీ స్థానాలను కైవసం చేసుకుందని సీఎం గుర్తుచేశారు. 2001లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించామని... స్థానిక సంస్థల్లోనూ అధికార పార్టీ ఉంటే పనులు వేగంగా జరుగుతాయని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. 2004 నుంచి 2014 వరకు ప్రజలతో కలిసి పోరాడామని సీఎం అన్నారు. అన్ని మతాలను సమానంగా గౌరవిస్తామని కేసీఆర్ తెలిపారు. రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా ప్రజలు టీఆర్ఎస్ వైపే వున్నారని కేసీఆర్ గుర్తుచేశారు. 

సంక్షేమానికి అధిక ప్రాధాన్యత: 

కాంగ్రెస్ పార్టీ పదేళ్లలో ఎస్సీల సంక్షేమం కోసం రూ.6 వేల కోట్లు ఖర్చు చేస్తే.. తాము ఈ ఏడేళ్లలో రూ.23 వేల 296 కోట్లను ఖర్చు చేశామని సీఎం వెల్లడించారు. గిరిజనుల అభివృద్ధి కోసం పదేళ్లలో కాంగ్రెస్ 3 వేల 438 కోట్లు ఖర్చు పెడితే.. తాము రూ.14 వేల 447 కోట్లు ఖర్చు పెట్టామని సీఎం తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి  అన్ని వర్గాల సంక్షేమం కోసం రూ.2 వేల 166 కోట్లు ఖర్చు చేస్తే.. తాము ఏడాదికి రూ.10 వేల 118 కోట్లు ఖర్చు చేశామని కేసీఆర్ వెల్లడించారు. తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,37,638 కోట్లని.. ఏపీ తలసరి ఆదాయం రూ.1,80,215 కోట్లని, కేంద్రం తలసరి ఆదాయం రూ.1,28,829 కోట్లని సీఎం అన్నారు. ఏడేళ్లలో తెలంగాణ నుంచి కేంద్రానికి రూ.2 లక్షల 74 వేల కోట్లు వెళ్లిందని.. కానీ కేంద్రం నుంచి తెలంగాణ నుంచి వచ్చింది కేవలం రూ.42 వేల కోట్లని కేసీఆర్ తెలిపారు.

జాతీయ తలసరి కంటే తెలంగాణదే అధికం:

దేశానికి అధిక ఆదాయం ఇస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ నాల్గవ స్థానంలో వుందని సీఎం వెల్లడించారు. మంచి విద్య (education) అందిస్తే పిల్లలు ప్రపంచంతో పోటీ పడతారని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పేద విద్యార్ధుల కోసమే కేజీ టూ పీజీ విద్య ఉచితంగా అందిస్తున్నామని సీఎం గుర్తుచేశారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్లే స్కూళ్లుగా మార్చే ఆలోచన చేశామని సీఎం తెలిపారు. దేశంలోనే ఎక్కడా లేనన్ని గురుకులాలు తెలంగాణలో వున్నాయని కేసీఆర్ గుర్తుచేశారు. ఏడాదికి ఒక్కో విద్యార్ధికి రూ. లక్షా 25 వేలు ఖర్చు పెడుతున్నామన్నారు. 

కేంద్రం నుంచి నిధులు అందడం లేదు:

కేంద్రం మా కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా అప్పులు చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు. చెప్పడం  కాదు.. ఎంత గొప్పగా పనిచేశామన్నదే ముఖ్యమని సీఎం అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ సమస్యను పరిష్కరించామని కేసీఆర్ తెలిపారు. కేంద్రం నిధులను దారిమళ్లిస్తున్నారని కొందరు ఆరోపిస్తున్నారని సీఎం మండిపడ్డారు. కేంద్రం అసలు నిధులే సక్రమంగా ఇవ్వడం లేదని.. ఇక దారి మళ్లింపు ఎక్కడిదని కేసీఆర్ ప్రశ్నించారు. రెసిడెన్షియల్ స్కూల్స్‌లో (telangana residential schools) పిల్లలు తినే డైట్ మెనూ కూడా తానే రూపొందించానని సీఎం గుర్తుచేశారు. యాదాద్రి, భద్రాద్రి, ఎన్టీసీసీ నుంచి త్వరలో భారీగా విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందని ఆయన చెప్పారు. 

ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యకు పరిష్కారం:

పేదలు ఆత్మ గౌరవంతో బతికేందుకే డబుల్ బెడ్ రూమ్ పథకాన్ని ప్రవేశపెట్టామని సీఎం తెలిపారు. గత ప్రభుత్వాలు అడ్డగోలుగా ఇళ్లు మంజూరు చేశాయని  ఆయన ఎద్దేవా చేశారు. ఉన్న జనాభా కంటే అధికంగా మంజూరు చేసి నిధులు మాయం చేశారని కేసీఆర్ ఆరోపించారు. సొంత జాగ వున్న వారికి డబుల్ బెడ్ రూం ఇళ్లు త్వరలోనే మంజూరు  చేస్తామని సీఎం తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థకు సమాంతరంగా ఫీల్డ్ అసిస్టెంట్లు పనిచేస్తున్నారని చెప్పారు. ఫీల్డ్ అసిస్టెంట్‌లను (field assistants) తొలగించిన తర్వాతే నిధుల వినియోగం బాగా పెరిగిందని సీఎం తెలిపారు. 

కరెంట్ కోతలకు పరిష్కారం:

కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇవ్వలేదని.. తాము ఇస్తున్నామన్న విషయం ప్రజలకు తెలుసునన్నారు. నిరంతర కరెంట్ కోసం రూ.20 వేల కోట్లు ఖర్చు చేశామని సీఎం తెలిపారు. వక్ఫ్ బోర్డ్  ఆస్తుల మీద ఏడాదిలోపే విచారణ పూర్తి చేస్తామని కేసీఆర్ అన్నారు. ప్రపంచంలోనే హోంగార్డులకు ఎక్కడా లేని జీతాలు ఇస్తున్నామని.. ట్రాఫిక్ పోలీసులకు 30 శాతం ప్రత్యేక అలవెన్స్ ఇస్తున్నామని సీఎం అన్నారు. కొత్త సెక్రటేరియట్‌లో గుడి, మసీదు ఖచ్చితంగా వుంటుందన్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios