Asianet News TeluguAsianet News Telugu

కోవిడ్ 19 : వైద్య ఆరోగ్య శాఖకు కేసీఆర్ కీలక ఆదేశాలు...

దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ లలో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్ గా ఉండేలా చూసుకోవాలని సీఎం కెసిఆర్ వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. 

cm kcr special instructions to health department over covid pandemic - bsb
Author
Hyderabad, First Published Apr 24, 2021, 12:03 PM IST

దేశంలో అక్కడక్కడ అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపధ్యంలో రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ లలో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించుకుని అప్డేట్ గా ఉండేలా చూసుకోవాలని సీఎం కెసిఆర్ వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశారు. 

వేసవి కాలం కావడం, అన్ని ఆసుపత్రుల్లో కరోనా పేషంట్లు నిండి ఉన్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని ఆదేశించారు. గాంధీ, నిమ్స్ లాంటి పేషంట్లు ఎక్కువ ఉన్న ఆసుపత్రుల్లో ఫైర్ ఇంజన్లు పెట్టాలని ఆదేశించారు.

యుద్ద విమానాలను ఉపయోగించి తీసుకువస్తున్న ఆక్సిజన్ ను అవసరం ఉన్న ప్రతి ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటల్ కి చేరేవిధంగా సమన్వయం చేసుకోవాలని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ వెంటనే హోమ్ ఐశోలేషన్ కిట్స్ అందించాలని ఆదేశించారు. 

ఇంట్లోనే ఉండి చికిత్స పొందుతున్న ప్రతి ఒక్కరినీ మానిటర్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కు ఆదేశించారు. ఎన్ని లక్షల మందికి అయిన హోమ్ ఐశోలేషన్ కిట్స్ అందించడానికి వీలుగా కిట్స్ ను సమకూర్చాలని సీఎం కెసిఆర్ ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు.

కరోనా వ్యాప్తి పెరిగిన నేపథ్యంలో పరీక్షలు చేయించుకొనే వారి సంఖ్య కూడా దేశ వ్యాప్తంగా పెరిగింది. ఈ క్రమంలో కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్ కొరత ఏర్పడకుండా ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా వాటిని  మన రాష్ట్రానికి తెచ్చే విధంగా.. ఎయిర్ లిఫ్ట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ లేఖ రాయనున్నారు. 

కిట్స్ కి కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ప్రజలు కూడా కరోనా నియంత్రణలో పూర్తి సహకారం అందించాలని మంత్రి తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios