తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు. హెలికాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలిస్తున్నారు. 

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి చేరుకున్నారు. హెలికాప్టర్‌లో ఏరియల్‌ వ్యూ ద్వారా యాదాద్రి ఆలయ పునర్నిర్మాణ పనులను కేసీఆర్ పరిశీలించారు. ప్రధాన ఆలయం, కోనేర, రోడ్లను పరిశీలించారు.సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. బాలాలయంలో లక్ష్మీనరసింహ స్వామిని సీఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు .తుది దశకు చేరుకున్న ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం పరిశీలించనున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఉన్నారు. సీఎం పర్యటన దృష్ట్యా యాదాద్రిలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 

మార్చి 28న Mahakumbha Samprokshan నిర్వహించనున్న విషయం తెలిసిందే. అంతకు ముందు వారం రోజుల పాటు మహా సుదర్శన యాగం నిర్వహిస్తారు. ఆలయ ప్రధాన గోపురానికి బంగారు తాపడం పనులు త్వరలోనే మొదలవుతాయి. ప్రధానఆలయ ముఖద్వారం, ధ్వజస్తంభం, బంగారు తాపడం పనులు చివరి దశలో ఉన్నాయి.

సుదర్శన యాగంలో 1108 యజ్ఞగుండాలను ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో గుండానికి ఆరుగురు చొప్పున దాదాపు 6వేల పై చిలుకు రిత్విక్కులు పాల్గొంటారు. దేశ విదేశాలనుంచి యాదాద్రి పునఃప్రారంభం వేడుకలకు వచ్చే ప్రముఖులు, అతిథులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, లక్షలాదిమంది భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలపై సీఎం సమీక్షిస్తారు. మహాకుంభ సంప్రోక్షణ తేదీ దగ్గర పడుతుండడంతో అక్కడ యాగశాల నిర్మాణం, ఇతర పనులను కూడా కేసీఆర్ పరిశీలించనున్నారు.