తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ రోజు సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. సాయంత్రం ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. కేసీఆర్ వెంట కొందరు మంత్రులు కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం ఉంది. రెండు, మూడు రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే బస చేయనున్నారు. జాతీయ రాజకీయాలపై కొందరు కీలక నేతల్ని కలిసి కేసీఆర్ చర్చలు జరిపే అవకాశం ఉంది. అయితే కేసీఆర్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
