తెలంగాణ సీఎం కేసీఆర్  ఆదివారం నాడు  సిద్దిపేటలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు


సిద్దిపేట: తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదివారం నాడు సిద్దిపేటలో పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఆదివారం నాడు ఉదయం సీఎం కేసీఆర్ సిద్దిపేటకు చేరుకొన్నారు. సిద్దిపేటలో రూ. 63 కోట్ల 60 లక్షలతో నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. కొత్త కలెక్టరేట్ కార్యాలయంతో పాటు ఎస్పీ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని కూడ సీఎం ప్రారంభించారు. కలెక్టరేట్ లోని రూమ్ లను సీఎం కు మంత్రిి హరీష్ రావు చూపారు. 

 ఈ సందర్భంగా ప్రజలు ఇచ్చిన వనతిపత్రాలను కేసీఆర్ తానే అందుకొన్నారు. సిద్దిపేట నుండి సీఎం కేసీఆర్ కామారెడ్డి జిల్లాలో జరిగే కార్యక్రమాల్లో సీఎం పాల్గొంటారు.ఇవాళ్టి నుండి కేసీఆర్ జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఈ నెల 21న వరంగల్ జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. ఈ నెల 22న యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటిస్తారు. భువనగిరి జిల్లాలో ని వాసాలమర్రి గ్రామంలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. ఈ గ్రామాన్ని సీఎం కేసీఆర్ దత్తత తీసుకొన్నారు.