Asianet News TeluguAsianet News Telugu

సీఎం కేసీఆర్ తెలంగాణ తాలిబాన్: దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ను తాలిబన్ గా పేర్కొంటూ విమర్శలు గుప్పించారు. 

cm kcr is a telangana taliban... dasoju sravan sensational comments
Author
Hyderabad, First Published Aug 18, 2021, 11:13 AM IST

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ని తాలిబన్ గా పేర్కొన్నారు ఏఐసీసీ అధికార ప్రతినిది దాసోజు శ్రవణ్. ప్రస్తుతం అప్ఘానిస్తాన్ ను తాలిబన్లు నాశనం చేస్తున్నట్లుగానే తెలంగాణను కేసీఆర్ సేన నాశనం చేస్తోందన్నారు. తాలిబన్ల మాదిరిగానే తెలంగాణ సీఎం ప్రభుత్వ వ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారని శ్రవణ్ ఆరోపించారు. 

మంగళవారం దాసోజు శ్రవణ్ గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలంగాణను మరో బిహార్ గా మారుస్తున్నారని... ప్రజల సొమ్మును ఇష్టారీతిన దోచుకుంటున్నారని పేర్కొన్నారు. దళిత బంధు ఓ రాజకీయ డ్రామా అని శ్రవణ్ ఆరోపించారు. ఏడేళ్లుగా రాష్ట్రాన్ని పాలిస్తున్నా గుర్తురాని దళితులు ఇప్పుడే ఎందుకు గుర్తుకువచ్చారు? అని ప్రశ్నించారు. ఇప్పుడు అవసరం వుంది కాబట్టి దళిత ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మొదలు దళిత నాయకులు, నేతలను కేసీఆర్ కౌగిలించుకుంటున్నారని అన్నారు. 

read more   కులం పేరుతో దళితులపై దూషణలు.. రేపు హైదరాబాద్‌కు జాతీయ ఎస్సీ కమీషన్, చిక్కుల్లో మైనంపల్లి

గతంలో బిసిలను నమ్మించి మోసం చేసినట్లు ఇప్పుడు దళితులకు దళిత బంధు పేరిట మోసం చేయడానికి కేసీఆర్ సిద్దమయ్యారని అన్నారు. ఈ దళిత బంధు పథకాన్ని ఎలా అమలుచేస్తారో చెప్పాలన్నారు.   రాష్ట్రంలోని 17 లక్షల మందికి దళిత బంధు ఇస్తానంటున్న సీఎం కేసీఆర్ ఎలా ఇస్తారో తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. 

హుజురాబాద్ లో ఇటీవల ప్రభుత్వ ఆధ్వర్యంలో దళిత బంధు ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగిందని... ఆ సభావేదికపై కౌశిక్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఏ అధికారంతో కూర్చున్నారని నిలదీశారు. ప్రభుత్వ కార్యక్రమంలో వేదికపై ఇలా టీఆర్ఎస్ నాయకులు కూర్చుంటే అక్కడే వున్న సీఎస్ సోమేష్ కుమార్ ఏం చేస్తున్నారు... ఆయనకు ఈమాత్రం సోయి లేదా? అని మండిపడ్డారు. రాష్ట్రానికి సేవ చేయాల్సిన ఉన్నత స్థానంలో వున్న సీఎస్ కేవలం ఓ వ్యక్తికి బానిసలా వ్యవహరిస్తున్నారని శ్రవణ్ దుయ్యబట్టారు. 

Follow Us:
Download App:
  • android
  • ios