అమరవీరుల స్మారక చిహ్నాన్ని ప్రారంభించిన కేసీఆర్.. కొవ్వొత్తుల వెలుగులతో నివాళి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు.

cm kcr inaugurates telangana martyrs memorial ksp

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అమరవీరుల స్మారక చిహ్నాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా 12 గన్ సెల్యూట్స్‌తో పోలీసులు అమరవీరులకు సెల్యూట్ చేశారు. అనంతరం స్మారక చిహ్నం ప్రాంగణంలో సీఎం కలియదిరిగారు. 

ఇకపోతే.. ఈ స్మారక చిహ్నం 161 అడుగుల ఎత్తు, 158 అడుగుల వెడల్పుతో క్లౌడ్ గేట్ కంటే ఆరు రెట్లు పెద్దగా నిర్మించారు. అతుకులు లేకుండా స్టెయిన్ లెస్ స్టీల్‌తో వున్న నిర్మాణం ప్రపంచంలో మరెక్కడా లేదు. సెక్రటేరియట్, హుస్సేన్ సాగర్, బుద్ధ విగ్రహం, లుంబినీ పార్క్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు తాజాగా అమర వీరుల స్మారకం హైదరాబాద్‌కు తలమానికంగా నిలవనున్నాయి. 

అనంతరం అమరుల నివాళి గీతంలో .. పదివేల మంది క్యాండిల్ లైట్ ప్రదర్శిస్తూ అమరులకు నివాళులర్పించారు. అనంతరం ఆరుగురు అమరవీరుల కుటుంబాలను కేసీఆర్ సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన డ్రోన్ షో అందరినీ ఆకట్టుకుంది. 

 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios