కొల్లూరులో డబుల్ బెడ్‌‌రూమ్ ఇళ్లను ప్రారంభించిన కేసీఆర్.. లబ్దిదారులకు అందుబాటులోకి 15,660 ఇళ్లు..

తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు. 

CM KCR inaugurates double bedroom houses at Kollur ksm

తెలంగాణ ముఖ్యంత్రి కేసీఆర్ ఈరోజు సంగారెడ్డి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా కొల్లూరులో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ పూజ కార్యక్రమంలో పాల్గొన్నా. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం కేసీఆర్ వీక్షించారు. తర్వాత లబ్దిదారులకు పట్టాలు అందజేశారు. కొల్లూరులో దాదాపు 142 ఎకరాల విస్తీర్ణంలో 15,660 కుటుంబాలకు వసతి కల్పించేందుకు ప్రభుత్వం ఈ నిర్మాణాలు చేపట్టింది. 117 బ్లాక్‌లలో రూ. 1,489 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ తరహా అపార్ట్‌మెంట్‌లలో ఇది అతిపెద్ద, ప్రతిష్టాత్మకమైన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల సముదాయం.  ఇందులో కొన్ని అపార్ట్‌మెంట్‌లు G+9 అంతస్తులతో ఉండగా, కొన్ని G+10 అంతస్తులతో ఉన్నాయి. దీనిని ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముదాయంగా చెబుతున్నారు. 

ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఆధునిక హంగులు, మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇచ్చారు. అవసరమైన నీటి సౌకర్యం, విద్యుత్ సరఫరా కోసం 33/11 కెవి సబ్‌స్టేషన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రతి అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో రెండు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సముదాయంలో 118 దుకాణాలను నిర్మించిన ప్రభుత్వం.. వాటిని అద్దెకు ఇవ్వనుంది. 

CM KCR inaugurates double bedroom houses at Kollur ksm

ఇక, పటాన్‌చెరులో రూ. 185 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించనున్న 200 పడకల సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి గురువారం ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios