తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రైతు సదస్సు కొనసాగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో రైతు సదస్సు కొనసాగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన రైతు సంఘాల నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా వ్యవసాయరంగంలో నెలకొన్న పరిస్థితులతో పాటు తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న వ్యవసాయం, సాగునీరు, విద్యుత్ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఇక, 26 రాష్ట్రాలకు చెందిన రైతు సంఘాలు ఈరోజు ఉదయం ప్రగతి భవన్‌కు చేరుకున్నారు. తెలంగాణలో వ్యవసాయం, సాగునీటి రంగం, ఇతర ప్రగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని తిలకరించారు.

అనంతరం రైతు సంఘాల నేతలతో సీఎం శ్రీ కేసీఆర్ అధ్యక్షతన రైతు సదస్సు ప్రారంభం అయింది. మధ్యాహ్నం జాతీయ రైతు సంఘాల నేతలతో కలిసి కేసీఆర్ భోజనం చేయనున్నారు. లంచ్ అనంతరం రైతు సదస్సు తిరిగి కొనసాగనుంది. 

ఇక, రైతుసంఘాల నాయకులు, ప్రతినిధులు శుక్రవారం తెలంగాణకు విచ్చేశారు. వీరి బృందం మూడు రోజులపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించనుంది. హోటల్‌ టూరిజం ప్లాజాలో వీరు బస చేస్తున్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టనున్నారు. మల్లన్నసాగర్‌, సింగాయపల్లిల్లో రైతు సంఘాల ప్రతినిధి బృందం పర్యటించింది. మల్లన్నసాగర్ సందర్శన సమయంలో తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. గోదావరి జలాల ఎత్తిపోతల పథకం గురించి వారికి వివరించారు.