TSPSC: తెలంగాణ ప్ర‌భుత్వం మరో సంచల నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల ఎంపిక లో మార్పులు చేయాల‌ని నిర్ణయం తీసుకున్నది కేసీఆర్ సర్కార్. ఈ నిర్ణ‌యం మేర‌కు ఇంటర్వ్యూలు ఎత్తేయాలని నిర్ణయం తీసుకుందట‌. ఈ మ‌రో రెండు రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌నున్నది. 

TSPSC: తెలంగాణ ప్ర‌భుత్వం మరో సంచల నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. చాలా రోజుల త‌రువాత ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఉద్యోగ నియామకాల‌ను చేప‌డుతున్నది కేసీఆర్ స‌ర్కార్. ఈ నియ‌మ‌క ప్ర‌క్రియను పారదర్శకంగా చేప‌ట్టాల‌నే లక్ష్యంతో ఇప్ప‌టికే అనేక మార్పులు చేసిన విష‌యం తెలిసిందే. కొత్త జోనల్ విధానంతో స్థానికులకే మెజారిటీ సంఖ్యలో ఉద్యోగాలు దక్కేలా చర్యలు తీసుకుంది. తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా కేసీఆర్ సర్కార్ ముందుకు వెళ్తుతోంది. 

తాజాగా.. గ్రూప్ 1 (Group-1), గ్రూప్ 2 (Group-2 ), ఉద్యోగాల ఎంపిక విధానంలో మార్పులు చేయాల‌ని భావిస్తోంది. గ్రూప్ 1, గ్రూప్ 2 నియామకాల్లో ఇంటర్వ్యూలను రద్దు చేయడానికి సిద్ధమైందట‌. ఇప్పటి వరకు గ్రూప్-1 కు సంబంధించి ఇంటర్వ్యూలకు 100 మార్కులు, గ్రూప్-2కు సంబంధించి 75 మార్కులు ఉన్నాయి. అయితే.. ఇంటర్వ్యూల విధానంపై ఉమ్మ‌డి రాష్ట్రంలో నుంచే తీవ్ర విమర్శలు, అనేక ఆరోపణలు వ‌స్తున్నాయి. ఇంటర్వ్యూల్లో అవినీతి జరుగుతుంద‌ని.. అనేక మంది ప్రతిభ కలిగిన అభ్య‌ర్థుల‌కు అన్యాయం జరుగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే.. ఇంటర్వ్యూలను రద్దు చేయాలనే డిమాండ్లు చాలా రోజులుగా ఉన్నాయి.

ఈ త‌రుణంలో గ్రూప్ 1 (Group-1), గ్రూప్ 2 (Group-2) ఉద్యోగాల ఎంపికపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రూప్ వన్, గ్రూప్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్ లో మార్పులు చేయడానికి నిర్ణయం తీసుకున్న సర్కార్. ఇంటర్వ్యూలు ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఎస్పీఎస్‌సీ, సంబంధిత శాఖ‌లు ఫైల్ సిద్ధం చేసి సీఎం కేసీఆర్ ఆమోదం కోసం.. ఫైల్ ను ప్రగతి భావన్ కు పంపింది. ఇప్ప‌టికే ఏపీలోని సీఎం జగన్ సర్కార్ గ్రూప్స్ ప‌రీక్ష‌ల‌కు ఇంటర్వ్యూలను రద్దు చేసింది.

ఈ నిర్ణ‌యం వ‌ల్ల సమయం ఆదాతో పాటు అవినీతి ఆరోపణలు తావులేకుండా.. ఉండేందుకే ఇంటర్వ్యూలు ఎత్తేయాలని నిర్ణయం తీసుకుంది సర్కార్. టీఎస్పీఎస్సి ద్వారా నియామకం అయ్యే పోస్ట్ ల్లో ఈ రెండింటికె ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నారు

 ఒకట్రెండు రోజుల్లో సీఎం కేసీఆర్ ఈ ఫైల్ పై ఆమోద మద్ర వేయ‌నున్న‌ట్టు అధికార వర్గాల నుంచి సమాచారం. దీనిపై కార్ల‌టీ వ‌చ్చిన అనంత‌రం.. గ్రూప్స్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ ను విడుదల చేయనుంది. నోటిఫికేషన్ విడుదలైన నాటి నుంచి మూడు నెలల తర్వాత గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు 503 గ్రూప్ 1 పోస్టుల్ని భర్తీ చేయ‌నున్న‌ట్టు 
 తెలంగాణ ప్రభుత్వం ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. 

ఈ నిర్ణ‌యం ప్ర‌కారం చూసుకుంటే.. ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల.. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొద‌టి వారంలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు 90 రోజులు ప్రిపరేషన్ సమయం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నారు. పరీక్ష నిర్వహించిన 30 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.