మహిళా సంఘా వీవోఏలకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. రాఖీ పండుగ సందర్భంగా వారికి జీతం పెంచుతూ కానుక అందించారు. వచ్చే నెల నుంచి వారికి రూ. 8000 జీతాలు అందనున్నాయి. 

హైదరాబాద్: రక్షా బంధన్ కానుకగా సీఎం కేసీఆర్ మహిళా సంఘాల వీవోఏలకు కీలక నిర్ణయం తీసుకున్నారు. వారికి భరోసా నిలిస్తూ జీతాలను పెంచారు. ఈ పెంచిన వాటితో ఇప్పుడు వీవోఏలకు (మహిళా సంఘాల సహాయలకు) నెలకు రూ. 8000 వరకు జీతాలు అందనున్నాయి. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. సెప్టెంబర్ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది. 

అంతేకాదు, యూనిఫాం కోసం నిధులు అందించాలని, మూడు నెలలకు ఒకసారి రెనివల్ విధానాన్ని ఏడాదికి పెంచాలని, జీవిత బీమా అమలు చేయాలనే విజ్ఞప్తులకు సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పదించారు. యూనిఫాం కోసం ఏడాదికి రూ. 2 కోట్ల నిధులు అందించాలని, రెనివల్ విధానాన్ని ఏడాదికి పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి విధి విధానాలను అధ్యయనం చేసి నివేదిక అందించాలని మంత్రి దయాకర్ రావున సీఎం ఆదేశించారు. మహిళా సంఘాలతో సమావేశమై ఈ నిర్ణయాన్ని ప్రకటించాలని హరీశ్ రావును ఆదేశించారు.

Also Read: ఖాజాగూడలో కొత్తరాతియుగపు ఆనవాళ్లు.. 6000 ఏళ్ల కిందటి ఆనవాళ్ల గుర్తింపు

ఈ నిర్ణయంపై మహిళా సంఘాల సహాయకులు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు.