ఇటీవలే కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్ లో చేరిన మాజీ మంత్రి ముత్యంరెడ్డికి ముఖ్యమంత్రి బంపర్ ఆపర్ ఇచ్చారు. ముత్యం రెడ్డి రైతు కుటుంబం నుండి రాజకీయాల్లో వచ్చాడు కాబట్టి రైతుల కష్టాలు ఆయనకు బాగా తెలుసని కేసీఆర్ అన్నారు. అందువల్ల ఆయనకు రైతు సమస్వయ సమితిలో ముఖ్య పాత్ర ఉండేలా సమున్నతి పదవి ఇవ్వనున్నట్లు హామీ కేసీఆర్ హామీ ఇచ్చారు. నిజాయితీ పరుడైన ముత్యంరెడ్డి రైతులకు మేలు చేసేలా పనిచేయగలడని నమ్మి ఆయనకు ఈ హామీ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. 

నర్సాపూర్ లో జరిగిన ప్రజా ఆశిర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా  ఆ సభకు హాజరైన దుబ్బాక మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యం రెడ్డిని ఆత్మీయంగా పలకరించారు. అనంతరం తన ప్రసంగంలో ఆయన్ని పొగుడుతూ రైతు సమన్వయ సమితిలో స్థానం కల్పించనున్నట్లు హామీ ఇచ్చారు. 

తెలంగాణలోని రైతలను ధనవంతులను చేసేవరకు తాను విశ్రమించని కేసీఆర్ అన్నారు. మార్కెట్ అవసరాలు, నేల స్వభావాన్ని దృష్టిలో పెట్టుకుని రైతులు పంటు వేయాలని కేసీఆర్ సూచించారు. ఆలా రైతులను చైతన్యం చేయడానికే క్రాప్ కాలనీలు అనే పద్దతిని తెలంగాణ ప్రజలకు పరిచయం చేసినట్లు తెలిపారు. ఇలా రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను అనుభవజ్ఞుడైన ముత్యం రెడ్డి ఆద్వర్యంలో జరుపుకుందామని కేసీఆర్ ప్రజలకు సూచించారు. 

దుబ్బాక నుండి కాంగ్రెస్ తరపున సీటు ఆశించి భంగపడ్డ ముత్యం రెడ్డి ఇటీవలే హరీష్రావు సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ సమయంలోనే అతడికి ఏదైనా నామినేటెడ్ పదవి ఇస్తామని టీఆర్ఎస్ ఆఫర్ చేసిందని ప్రచారం కూడా జరిగింది. అందుకు తగ్గట్లుగానే కేసీఆర్ నర్పాపూర్ సభలో ఆయనకు హామీ ఇచ్చారు.