Asianet News TeluguAsianet News Telugu

స్వాతంత్య్ర సమరయోధులు ఆత్మలు ఘోషించేవి.. పంద్రాగస్టు వేదికగా కేంద్రంపై కేసీఆర్ ఫైర్

తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించింది. స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం కేసీఆర్.. కేంద్రంపై మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

cm kcr fires on centre government in independence day speech
Author
First Published Aug 15, 2022, 11:52 AM IST

తెలంగాణ ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహించింది. స్వాతంత్ర దినోత్సవం వేడుకల సందర్భంగా గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని వివరించారు. అలాగే తెలంగాణలో అమలు చేస్తున్న సంక్షేమాన్ని తెలియజేశారు. తెలంగాణ అపూర్వ విజయాలను సొంతం చేసుకుంటోందని చెప్పారు.  అనంతరం కేసీఆర్.. కేంద్రం టార్గెట్‌గా విరుచుకుపడ్డారు. 

తెలంగాణ ప్రభుత్వం అన్ని రంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని అధికంగ చేస్తూ అనుహ్యమైన ప్రగతిని సాధిస్తుంటే.. కొందరు అప్పులు ఎక్కువగా చేస్తుందని అవగాహన రహిత్యంతోనే, కుట్రపూరితంగానో వ్యాఖ్యాలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత చేసిన రూ. 1,49,873 కోట్లు మాత్రమేనని చెప్పారు. ఈ రుణాన్ని ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించిందన్నారు. దేశంలోని 22 రాష్ట్రాలు తెలంగాణ కన్నా ఎక్కువగా అప్పులు కలిగి ఉన్నాయని చెప్పారు. జీఎస్‌డీపీలో తెలంగాణ అప్పుల నిష్పతి 23.5 శాతం కాగా.. జీడీపీలో దేశం అప్పల నిష్పత్తి 50.4 శాతంగా ఉందన్నారు. తెలంగాణ అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిధిలోనే ఉన్నాయని చెప్పారు. ఈ వాస్తవాలు గమనించకుండా తెలంగాణ అప్పులు చేస్తుందంటూ బురద జల్లడమే లక్ష్యంగా పెట్టుకుని దుష్ప్రచారం మండిపడ్డారు.   

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోడు గుర్రాల మాదిరిగా ప్రగతి రథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకున్నారని అన్నారు. ఢిల్లీ గద్దె మీద కూర్చొన్న ప్రస్తుత ప్రభుత్వం.. సమాఖ్య వ్యవస్థకు తూట్లు పొడుస్తుందని ఆరోపించారు. కూర్చొన్న కొమ్మను నరుకున్న విధంగా.. రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలకు కేంద్రం పాల్పడుతుందని విమర్శించారు. రాష్ట్రాల ఆర్థిక స్వేచ్చను దెబ్బతిస్తూ అనేక ఆంక్షలు విధిస్తుందని చెప్పారు. ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పేర్కొన్న.. రాజ్యాంగం తొలి అధికరణాన్నే కేంద్రం అపహస్యం చేస్తుందని విమర్శించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడ్డారు. పసి పిల్లలు తాగే పాలు మొదలుకొని.. ప్రజల అవసరాలన్నింటిపై పన్నులు విధిస్తూ విపరీతమైన  భారం మోపుతుందన్నారు. 

‘‘ప్రజా సంక్షేమం ప్రభుత్వాల బాధ్యత. సంక్షేమ పథకాలను కేంద్రం సరిగా అమలు చేయడం లేదు. సంక్షేమ పథకాలను ఉచితాలు అనే పేరుతో అవమానించడం తగదు. కేంద్రం అసమర్థ నిర్వాకం వల్ల దేశ ఆర్థికాభివృద్ది కుంటుపడింది. ద్రవ్యోల్భంణం పెరిగి.. నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రూపాయి విలువ ఎప్పుడూ లేనంతగా పడిపోయింది. దేశంలో ఎప్పుడూ లేనంతగా నిరుద్యోగం పెరిగిపోయింది. 

కేంద్రంలోని పెద్దలు వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజించే ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తరతరాలుగా భారత్ నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని విచ్చిన్నం చేసేందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే పాసిస్టు దాడులకు పాల్పడుతున్నారు. ఈ దుర్మార్గాలను చూసి స్వాతంత్య్ర సమరయోధులు ఆత్మలు ఘోషించేవి నేను భావిస్తున్నాను. తెలంగాణలో మత విద్వేషాలను రెచ్చగొట్టాలని, అభివృద్దిని దెబ్బతీయాలని విచ్చిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది’’ అని కేంద్రంపై కేసీఆర్ ఫైర్ అయ్యారు. 

Follow Us:
Download App:
  • android
  • ios