నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానంలో జరగనున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధిగా బరిలోకి దిగనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత.

Also Read:కేసీఆర్ ఆలోచన: తనయ కవితకు నో, రాజ్యసభకు పొంగులేటి

టీఆర్ఎస్ పార్టీ తరపున ఆమె బుధవారం నామినేషన్ వేయనున్నారు. ఎల్లుండితో నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది. అయితే అధికారికంగా తెలంగాణ రాష్ట్ర సమితి ఆమె అభ్యర్ధిత్వాన్ని ప్రకటించాల్సి ఉంది. 

గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల సందర్భంగా ఓటమిపాలైన కవిత ఆ తర్వాత రాజకీయంగా యాక్టివ్‌గా కనిపించలేదు. రాజ్యసభ సభ్యురాలిగా ఆమెను పంపుతారని ప్రచారం జరిగినప్పటికీ, తుది జాబితాలో ఆమె పేరు కనిపించకపోవడంతో కవిత వచ్చే ఎన్నికల వరకు ఎదురుచూస్తారని కధనాలు వెలువడ్డాయి.

Also Read:కవిత లేని లోటు: నిజామాబాద్‌లో టీఆర్ఎస్‌కు బీజేపీ సవాల్

ఇదే సమయంలో కొద్దిరోజుల క్రితం నిజామాబాద్ రూరల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ .. కవితపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎం కుమార్తె ఎమ్మెల్సీ అయి మంత్రి పదవిని చేపట్టవచ్చని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నిజమయ్యేలా కనిపిస్తున్నాయి.