హైదరాబాద్: మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్ పేయి మృతి పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ ప్ర‌గాఢ సంతాపం వ్య‌క్తం చేసారు. ఉత్త‌మ పార్ల‌మెంటేరియ‌న్ గా, మాజీ ప్ర‌ధానిగా విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయాల‌ను న‌డిపిన వ్యక్తి అని కొనియాడారు. 

వాజ్ పేయి దేశానికే కాక యావ‌త్ ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచారని ఆయన మృతి తీర‌ని లోట‌న్నారు. ఉదారవాది, మానవతావాది, కవి, సిద్ధాంతకర్త, మంచి వక్త, నిరాడంబరుడు, నమ్మిన సిద్ధాంతం కోసం జీవితాంతం వరకు పనిచేసిన అట‌ల్ జీ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని కోరారు