Asianet News TeluguAsianet News Telugu

పార్టీ పెట్టుడు అంత ఈజీ కాదు.. వైఎస్ షర్మిల కొత్తపార్టీపై సీఎం కేసీఆర్..

ఆదివారం నాడు టీఆర్ఎస్ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో  కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం మార్పు పై క్లారిటీ ఇచ్చారు. మరో పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. 

cm kcr comments on new political party in telangana - bsb
Author
Hyderabad, First Published Feb 8, 2021, 2:14 PM IST

ఆదివారం నాడు టీఆర్ఎస్ భవన్ లో జరిగిన టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో  కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో సీఎం మార్పు పై క్లారిటీ ఇచ్చారు. మరో పదేళ్లపాటు తానే ముఖ్యమంత్రిగా ఉంటానని స్పష్టం చేశారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. 

పార్టీ రాష్ట్ర కార్యవర్గం సమావేశం వేదికగా కేసీఆర్ మరో ఆసక్తికరమైన కామెంట్ చేశారు. కొత్తపార్టీ విషయాన్ని లేవనెత్తి షర్మిల పార్టీ విషయంపై పరోక్షంగా కామెంట్ చేశారు. కార్యవర్గ సమావేశంలో మాట్లాడుతూ కేసీఆర్ అనూహ్యంగా కొత్త పార్టీ ప్రస్తావన తెచ్చారు. పార్టీ ఏర్పాటు, అందులోని సాధకబాధకాల వంటి అంశాలను ప్రస్తావించారు. 

ఎవరు పార్ట పెడుతున్నారు, ఏ పార్టీ అని చెప్పకుండా.. కొత్తగా పార్టీ పెట్టడం అంటే అంత ఈజీనా? దానికి ఎంత శ్రమ కావాలి? ఇదివరకు ఎన్ని పార్టీలు రాలేదు.. పోలేదు? నరేంద్ర, విజయశాంతి, దేవేందర్‌గౌడ్‌ పెట్టిన పార్టీలు మట్టిలో కలిసిపోలేదా? నాలుగు రోజుల్లో తోక ముడుస్తారు.. ఎటూ గాకుండా.. తెరమరుగైపోతారు.. అంటూ అని వ్యాఖ్యానించారు. 

ఈ సందర్భంగా పాత విషయాలు గుర్తు చేసుకున్నారు..1985లో టీడీపీ తరఫున నేను సిద్దిపేట నుంచి, రామచంద్రారెడ్డి దొమ్మాట నుంచి ఒకేసారి గెలిచాం. కొన్నాళ్లకు జానారెడ్డి, కేఈ కృష్ణమూర్తి తదితరులతో కలిసి రామచంద్రరెడ్డి టీడీపీ నుండి బైటికి వెళ్లాడు. కొత్త పార్టీ పెట్టారు. 

ఆ తర్వాత కొద్ది రోజులకే కాంగ్రెస్ లో చేరారు. ఆ వెంటనే జరిగిన ఎన్నికల్లో రామచంద్రారెడ్డికి టికెట్ కూడా రాలేదు. దీంతో ఆయన తెరమరుగయ్యారు. రామచంద్రారెడ్డి కోసం సిద్ధిపేటలో ఇటీవల నేనే ఇంటి స్థలం ఇప్పించి.. నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా చేశాను అని చెప్పుకొచ్చారు. 

రాంగ్ ట్రాక్ లో వెడితే ఇలాగే ఉంటుంది. రామచంద్రారెడ్డి మంచివాడే కానీ ఫలితం లేకుండా పోయింది. ప్రాంతీయ పార్టీలు నిలదొక్కుకోవడం ఈజీకాదు. టీడీపీ తర్వాత నిలదొక్కుకున్న ప్రాంతీయ పార్టీ టీఆర్‌ఎస్‌ ఒక్కటే’’ అని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios