యుద్ధ సమయానికి బ్రిటన్‌లో విన్‌స్టన్ చర్చిల్ ప్రధానిగా విజయం సాధించారు. కానీ ప్రధానిగా ఆయన ఫెయిల్ అయ్యారని.. మీరు కూడా అలాగే ఫెయిలవుతారని ప్రముఖ జర్నలిస్ట్ కొత్తూరి వెంకటేశ్వరరావు చెప్పారని కేసీఆర్ గుర్తుచేశారు.

ఉద్యమం బాగా నడిపారని.. రాష్ట్రాన్ని సమర్థవంతంగా నడపలేరని మేము అనుకున్నామని కానీ మీరు అంచనాలు తలక్రిందులు చేశారని కొత్తూరి తనతో స్వయంగా చెప్పారని సీఎం అన్నారు.

ఎక్కడా కుల, మత, ప్రాంతీయ వివక్షలు లేకుండా ముందుకెళ్లామని కేసీఆర్ అన్నారు. హైదరాబాద్‌లో ఉన్న ప్రతి బిడ్డా.. మా బిడ్డేనన్నారు. రాష్ట్ర ప్రజలకు 24 గంటలూ మంచినీరు ఇవ్వాలన్నదే తన లక్ష్యమని.. ఢిల్లీ, నాగపూర్‌లలో ఇప్పటికే అధ్యయనం చేశామని.. 20వేల లీటర్ల వరకు నల్లా బిల్లులు రద్దు చేస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.  

ఢిల్లీ తర్వాత దేశంలో తెలంగాణలో మాత్రమే నల్లా బిల్లులు రద్దు చేసిందని.. దీనిని అపార్ట్‌మెంట్‌లకూ వర్తింపజేస్తామన్నారు. అంతకుముందు హైదరాబాద్‌లో షాప్‌కు వెళ్లినా పెట్రోల్ కంపేనని.. అపార్ట్‌మెంట్ల విషయానికి వస్తే ఇన్వర్టర్లు, స్టెబిలైజర్లు కనిపిస్తాయన్నారు.

భారతదేశ తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ అగ్రస్థానంలో వుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసిందని కేసీఆర్ చెప్పారు. మిషన్ భగీరథను అందించకపోతే ఓట్లు అడగమని చెప్పిన విషయాన్ని సీఎం చెప్పారు.

రాష్ట్రంలో నీటి సమస్యను పరిష్కరించామని.. ఇంకొన్ని సమస్యలు వున్నాయని వాటిని త్వరలోనే పరిష్కరిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. ఛాలెంజ్ చేసి, తొడగొట్టి మిషన్ భగీరథ పూర్తి చేశామన్నారు. టీఆర్ఎస్ మగతనం ఉన్న పార్టీ అన్నారు.