గత కొద్దినెలలుగా ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్‌లు చాలా కలివిడిగా కనిపించారు. తొలిసారిగా తెలంగాణ నూతన సచివాలయానికి వచ్చిన గవర్నర్‌కు కేసీఆర్ దగ్గరుండి సెక్రటేరియట్‌ను చూపించారు.
గత కొద్దినెలలుగా ఉప్పు నిప్పులా వ్యవహరిస్తున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్, సీఎం కేసీఆర్‌లు చాలా కలివిడిగా కనిపించారు. తెలంగాణ సచివాలయం ప్రాంగణంలో ప్రార్థన మందిరాల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో వీరిద్దరూ పాల్గొన్నారు. తెలంగాణ సచివాలయం నిర్మాణం సమయంలో ఇక్కడ ఉన్న నల్లపోచమ్మ ఆలయం, మసీదు, చర్చిలను తొలగించారు. నూతన సచివాలయంలో ఈ మూడు ప్రార్థన మందిరాలను నిర్మించింది ప్రభుత్వం. సచివాలయానికి నైరుతి దిశలో నల్ల పోచమ్మ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంతో పాటు గణపతి, ఆంజనేయస్వామి, సుబ్రమణ్యస్వామి ఆలయాలను కూడా నిర్మించారు.
గతంలో ఉన్న స్థలంలో మసీదును, చర్చిని కూడా నిర్మించారు. ఇవాళ నల్లపోచమ్మ ఆలయం పూర్ణాహుతి కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, సీఎం కేసీఆర్ లు పాల్గొన్నారు. అనంతరం సర్వమత ప్రార్ధనల్లోనూ కేసీఆర్ , గవర్నర్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగించారు. సచివాలయంలో మతసామరస్యాన్ని నెలకొల్పినట్టుగా చెప్పారు. గుడి, మసీదు, చర్చి ఒకే దగ్గర నిర్మించినట్టుగా తెలిపారు.
నల్ల పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు గవర్నర్, సీఎం.అనంతరం చర్చిని ప్రారంభించారు. చర్చిలో కేక్ ను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ , సీఎం కేసీఆర్ కట్ చేశారు.మసీదును ప్రారంభించిన తర్వాత ప్రార్ధనల్లో గవర్నర్, సీఎం పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ సచివాలయ భవనాన్ని కేసీఆర్ దగ్గరుండి గవర్నర్‌కు చూపించారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
