తెలంగాణలో బస్సులు, ఆటోలు, ట్యాక్సీలకు కేసీఆర్ అనుమతి.. హైదరాబాద్‌లో తప్ప
తెలంగాణ రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు తప్పించి మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్‌జోన్లుగా ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. సోమవారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు
తెలంగాణ రాష్ట్రంలో కంటైన్మెంట్ ఏరియాలు తప్పించి మిగిలిన అన్ని ప్రాంతాలను గ్రీన్‌జోన్లుగా ప్రకటించారు ముఖ్యమంత్రి కేసీఆర్. సోమవారం కేబినెట్ సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో మే 31 వరకు లాక్‌డౌన్‌ను కొనసాగిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులను ప్రారంభిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. ఉదయం 6 గంటల నుంచి సర్వీసులు నడుస్తాయని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే హైదరాబాద్ నగరంలో మాత్రం బస్సు సర్వీసులు ఉండవని సీఎం తెలిపారు.
రాష్ట్రంలో ఆటోలు, ట్యాక్సీలు అనుమతి ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ఆటోలో డ్రైవర్+2, ట్యాక్సీలో డ్రైవర్ +3 నిబంధన పాటించాలని సీఎం తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సెలూన్లను తెరుచుకోవచ్చునని.. ఈ కామర్స్‌ను అనుమతిస్తున్నామని కేసీఆర్ చెప్పారు.
ప్రైవేట్, ప్రభుత్వ కార్యాలయాలు జాగ్రత్తలతో, వందశాతం సిబ్బందితో కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. పరిశ్రమలు కూడా వంద శాతం నిర్వహించుకోవచ్చునని, కర్ఫ్యూ మాత్రం యథావిథిగా కొనసాగుతుందని ముఖ్యమంత్రి చెప్పారు.
1,452 కుటుంబాలు మాత్రమే కంటైన్‌మెంట్ జోన్‌లలో ఉంటాయన్నారు. ప్రస్తుతమున్న పరిస్ధితుల్లో కరోనాతో కలిసి జీవించాల్సిందేని సీఎం స్పష్టం చేశారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ బతుకు బండిని కొనసాగించాల్సిందేనన్నారు.
హైదరాబాద్ తప్పించి రాష్ట్రంలో అన్ని చోట్లా షాపులు తెరుచుకోవచ్చన్న సీఎం.. రాజధానిలో మాత్రం సరి- బేసి విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలని సీఎం సీఎం చెప్పారు. పరిశ్రమలు, ఫ్యాక్టరీలు, మాన్యుఫాక్చరింగ్ యూనిట్లు పనిచేసుకోవచ్చని కేసీఆర్ తెలిపారు.