తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు సోమవారం నాడు అసెంబ్లీలోని తమ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు.
హైదరాబాద్: Telangana Budget సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాంపై Congress ప్రజా ప్రతినిధులు సోమవారం నాడు అసెంబ్లీ ఆవరణలో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు అసెంబ్లీ ఆవరణలోని తమ పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు.
హైద్రాబాద్‌లోని ఓ హోటల్ లో ఆదివారం నాడు CLP సమావేశం జరిగింది.ఈ సమావేశంలో ప్రజల సమస్యలు వేటిని అసెంబ్లీలో ప్రస్తావించాల్సిన అంశంపై చర్చించారు. తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులతో పాటు DCC అధ్యక్షులను కూడా సీఎల్పీ సమావేశానికి ఆదివారం నాడు ఆహ్వానించారు. ఈ సమావేశంలో అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో సర్కార్ వ్యవహరించిన తీరును అసెంబ్లీలో లేవనెత్తాలని సీఎల్పీ భావిస్తుంది. మరోవైపు Dhalitha Bandhu పథకాన్ని రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయలని కూడా కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన మండలాల్లో దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈ పథకం అమలు చేస్తేనే ఈ పథకంతో దళితులకు ప్రయోజనం దక్కుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.
దళిత బంధు పథకంతో పాటు నిరుద్యోగ భృతి పథకం విషయమై కూడా తెలంగాణ ప్రభుత్వంపై అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఒత్తిడి తీసుకు రానున్నారు. ఇదిలా ఉంటే గవర్నర్ ప్రసంగం లేకుండా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడాన్ని కాంగ్రెస్ నేతలు తప్పు బడుతున్నారు.
అసెంబ్లీ సమావేశాల్లో రైతాంగ సమస్యలపై కాంగ్రెస్ ప్రధానంగా ప్రస్తావించాలని భావిస్తుంది. రైతు రుణమాఫీతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలపై కూడా కాంగ్రెస్ తమ పోరును తీవ్రం చేయాలని భావిస్తుంది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న సుమారు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేయాలని కూడా కాంగ్రెస్ కోరుతుంది.
ఇవాళ అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. శాసన మండలిలో శాసనమండలిలో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు.
