తొందరపాటు చర్యలొద్దని సూచించా: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డిరాజగోపాల్ రెడ్డికి పార్టీలో సముచిత గౌరవం ఇస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు ఇవాళ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో భేటీ ముగిసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.
హైదరాబాద్: komatireddy Rajagopal Reddy కి పార్టీ సముచిత గౌరవం ఇస్తుందని సీఎల్పీ నేత Mallu Bhatti Vikramarrka చెప్పారు. నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి పార్టీ మార్పు చారిత్రక అవసరమని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించడంతో భట్టి విక్రమార్క రాజగోపాల్ రెడ్డి సుమారు 4 గంటలకుపైగా చర్చించారు.సోమవారం నాడు సాయంత్రం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ ముగిసిన తర్వాత సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు.
also read:తెలంగాణలో ఇప్పుడు ఒరిజినల్ కాంగ్రెస్ లేదు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని కూడా తాను రాజగోపాల్ రెడ్డికి సూచించినట్టుగా CLP నేత భట్టి విక్రమార్క చెప్పారు. రాజగోపాల్ రెడ్డి కూడా ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకొంటారని తాను భావించడం లేదని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.ఎమ్మెల్యే లేవనెత్తిన అంశాలను పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని భట్టి చెప్పారు. కాంగ్రెస్ పార్టీలోనే రాజగోపాల్ రెడ్డి ఉంటారని తాను భావిస్తున్నట్టుగా చెప్పారు. పార్టీలో పదవులను అందరూ కోరుకుంటారన్నారు. కానీఅందరికి కూడా పదవులు ఇవ్వలేమన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిది కాంగ్రెస్ కుటుంబమన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీలంటే రాజగోపాల్ రెడ్డికి ప్రేమ, అభిమానంతో పాటు అపార గౌరవం ఉందని అని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎంపీగా కూడా రాజగోపాల్ రెడ్డి కీలకంగా వ్యవహరించారని ఆయన గుర్తు చేశారు.
Telangana రాష్ట్రం సాధించుకున్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆ ప్రయోజనాలు దక్కడం లేదనే ఆవేదన రాజగోపాల్ రెడ్డిలో ఉందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ తీరుపై గట్టిగా పోరాటం చేసే విషయంలో తనకు సరైన తోడ్పాటు రాలేదనే ఆవేదనతో రాజగోపాల్ రెడ్డి ఉన్నారన్నారు.
Congress పార్టీ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో బలంగా ఉందని భట్టి విక్రమార్క చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని భట్టి విక్రమార్క ధీమాను వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పై గట్టిగా పోరాటం చేద్దామని తాను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెప్పానన్నారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులను తమ నియోజకవర్గాల్లో ఉన్న అవసరాల రీత్యా తమ పార్టీ ప్రజాప్రతినిధులు కలిసి ఉండొచ్చన్నారు. ఇలా కలిసినంత మాత్రాన రాజకీయంగా చూడడం సరైంది కాదన్నారు.