కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సీఎల్పీ నేత భట్టి భేటీ:మునుగోడు ఎమ్మెల్యేకి బుజ్జగింపులు
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సోమవారం నాడు భేటీ అయ్యారు. రాజగోపాల్ రెడ్డిని బుజ్జగిస్తున్నారు.
హైదరాబాద్: మునుగోడు ఎమ్మెల్యే komatireddy Rajagopal Reddyతో సీఎల్పీ నేత Mallubhatti Vikramarka సోమవారం నాడు భేటీ అయ్యారు. పార్టీ మార్పు చారిత్రక అవసరమని రాజగోపాల్ రెడ్డి ఆదివారం నాడు వ్యాఖ్యలు చేసిన అంశం తెలిసిందే.ఈ నేపథ్యంలో CLPనేత భట్టి విక్రమార్క రాజగోపాల్ రెడ్డితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
నిన్న హైద్రాబాద్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన మునుగోడు ఎమ్మెల్యే పలు కీలక విషయాలపై స్పందించారు. పార్టీ మార్పు చారిత్రక అవసరమన్నారు. కేసీఆర్ ను గద్దెదించాల్సిన అవసరం ఉందన్నారు అయితే కేసీఆర్ గద్దె దించాల్సిన శక్తి కాంగ్రెస్ కంటే బీజేపీకి ఉందన్నారు. గతంలో ఈ వ్యాఖ్యలు తాను చేశానన్నారు.ఈ వ్యాఖ్యలకు తాను కట్టుబడి ఉన్నట్టుగా చెప్పారు కేసీఆర్ గద్దెదించడం కోసం పోరాటం చేయకపోతే చరిత్రహీనులుగా మారుతామన్నారు.
పార్టీ మారితే తాను సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు క్సమాపణ చెప్పి కాంగ్రెస్ కు రాజీనామా చేస్తానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. మునుగోడు నియోజకవర్గ ప్రజలకు తాను చెప్పిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకొంటానని తెలిపారు.
also read:ఈ నెల 27 తర్వాత బీజేపీలో చేరికలు.. రాజగోపాల్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం: ఈటల
ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు.బీజేపీలో చేరే విషయమై తాను చర్చించలేదని మీడియా సమావేశంలో చెప్పారు. గత కొంతకాలంగా పార్టీ మారుతారని రాజగోపాల్ రెడ్డిపై ప్రచారం సాగుతుంది. నిన్న మీడియా సమావేశంలో మాత్రం పార్టీ మార్పు చారిత్రక అవసరంగా పేర్కొనడం రాజకీయంగా చర్చకు దారితీసింది. కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల తీరును కూడా మీడియా సమావేశంలో రాజగోపాల్ రెడ్డి ప్రస్తావించారు. పార్టీ నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీ నష్టపోతుందున్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని పార్టీ మారకుండా ఉండేందుకు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చర్చిస్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేవనెత్తే అంశాలను పార్టీ అధినాయకత్వం దృష్టికి మల్లు భట్టి విక్రమార్క తీసుకొచ్చే అవకాశం ఉంది. హైద్రాబాద్ లోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసానికి చేరుకున్న భట్టి విక్రమార్క రాజగోపాల్ రెడ్డి లేవనేత్తే అంశాలపై చర్చిస్తున్నట్టుగా సమాచారం. పార్టీ వీడకుండా ఉండాలని రాజగోపాల్ రెడ్డిని కోరుతున్నారని తెలుస్తుంది.
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలతో రాజగోపాల్ రెడ్డి సమావేశాలు నిర్వహిస్తున్నారు.పార్టీ మార్పు విషయమై పార్టీ కార్యకర్తలతో చర్చిస్తున్నట్టుగా ప్రచారంలో ఉంది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ మాణికం ఠాగూర్, పార్టీ సంస్థాగత వ్యవహరాల ఇంచార్జీ కేసీ వేణుగోపాల్ తో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి లేవనేత్తిన అంశాలను మల్లుభట్టి విక్రమార్క చర్చించే అవకాశం ఉంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొంటున్నందున మునుగోడు అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని టీఆర్ఎస్ భావిస్తుంది. అయితే మునుగోడుప్రజలు కోరుకొంటే ఈ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు మరో వైపు తాను రాజీనామా చేయాలని అనుకోవడం లేదన్నారు.