ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నారా... లేదా సీఎం కేసీఆర్ కు భజన చేసేందుకు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.
ఖమ్మం: ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు పనిచేస్తున్నారా... లేదా సీఎం కేసీఆర్ కు భజన చేసేందుకు ఉన్నారా అని ఆయన ప్రశ్నించారు.
బుధవారం నాడు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో మీడియాతో మాట్లాడారు. ఏడేళ్లుగా ఉద్యోగ సంఘాల నేతలు ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. సీఎంతో సమావేశాలు నిర్వహించడం ఆ తర్వాత కేసీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేయడం మినహా ఏం చేశారని ఆయన ప్రశ్నించారు.
ఉద్యోగుల సమస్యల కోసం పనిచేయాలని నిబంధనల్లో ఉన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కానీ నియమ నిబంధనలకు విరుద్దంగా ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుబట్టారు.
ఉద్యోగుల సమస్యలు పట్టించుకోకుండా ఆ సంఘ నేతలు ఏం చేస్తున్నారని ఆయన అడిగారు.
ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టడమే పనిగా పెట్టుకొన్నారని ఆయన విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయించి కార్పోరేట్ సంస్థలకు లాభం చేకూర్చేందుకు ఆయన పనిచేస్తున్నారని మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు.
