ప్రభుత్వం రాజ్యాంగ బద్దంగా పనిచేయకపోతే ఆ ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం గవర్నర్లకు ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు.
హైదరాబాద్: రాజ్యాంగ బద్దంగా పని చేయకపోతే ప్రభుత్వాన్ని రద్దు చేసే అధికారం కూడా గవర్నర్ కు ఉంటుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.ఆదివారం నాడు CLP సమావేశం ప్రారంభానికి ముందు Mallu Bhatti Vikramarka ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు.
ప్రభుత్వం గాడి తప్పిన సమయంలో Governor జోక్యం చేసకొంటారని ఆయన చెప్పారు. గవర్నర్ కు, ప్రభుత్వానికి ఎక్కడ గ్యాప్ వచ్చిందో తెలియదన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం గవర్నర్ వ్యవస్థ ఏర్పాటు చేశారని ఆయన గుర్తు చేశారు.
Telangana Assembly Budget సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండానే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.ఈ నెల 7వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు గత అసెంబ్లీ సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నందున గవర్నర్ ప్రసంగం అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. అయితే తొలుత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తొలుత గవర్నర్ ప్రసంగం ఉంటుందని ప్రకటించారు. ఆ తర్వాత పొరపాటున ఈ సమాచారం పంపారని గవర్నర్ Tamilisai Soundararajan వివరించారు.
కొంత కాలంగా గవర్నర్ సౌందర రాజన్ కి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య గ్యాప్ వచ్చినట్టుగా పరిస్థితులు కన్పిస్తున్నాయి. ఈ గ్యాప్ రోజు రోజుకి పెరుగుతుంది. గవర్నర్ కు మంత్రులు ప్రోటోకాల్ కూడా ఇవ్వని పరిస్థితి నెలకొంది. గత అసెంబ్లీ సమావేశాలకు కొనసాగింపుగానే ఈ సమావేశాలు నిర్వహిస్తున్నందున అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉండదని తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. గత అసెంబ్లీ సమావేశాల తర్వాత అసెంబ్లీ ప్రోరోగ్ కానీ విషయాన్ని తెలంగాణ ప్రభుత్వం గుర్తు చేస్తుంది. అసెంబ్లీ ప్రోరోగ్ కాకపోవడంతో ఈ దఫా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం అవసరం లేదని తెలంగాణ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే ఈ సమయంలో గవర్నర్ ప్రసంగం నిర్వహిస్తే రాజ్యాంగం ప్రకారంగా అది తప్పేనని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు.
మరో వైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో తన ప్రసంగం లేకపోవడంపై గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ స్పందించారు. ఈ మేరకు శనివారం నాడు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలుత తన ప్రసంగం ఉంటుందని ప్రకటించారని ఆ ప్రకటనలో ఆమె గుర్తు చేశారు. కానీ ఆ తర్వాత పొరపాటున ఈ సమాచారం పంపారని ప్రభుత్వం వివరించిందన్నారు.
బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం లేకపోవడంతో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై చర్చ చేసే అవకాశం ప్రజా ప్రతినిధులకు లేకుండా పోతోందని గవర్నర్ కార్యాలయం విడుదల చేసిన ప్రకటన వివరించింది.
కొంత కాలంగా గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ కి కేసీఆర్ సర్కార్ కి అగాధం పెరుగుతుందనే ప్రచారం సాగుతుంది.ఈ ప్రచారానికి తగినట్టుగానే ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే సమయంలో సీఎం సహా మంత్రులు హాజరు కాలేదు. మేడారంలో గవర్నర్ వచ్చిన సమయంలో కూడా మంత్రులు గవర్నర్ కు స్వాగతం పలకలేదు. మేడారానికి గవర్నర్ వెళ్లే సమయంలో హెలికాప్టర్ కావాలని కోరినా కూడా ప్రభుత్వం నుండి స్పందన రాలేదని ప్రచారం సాగుతుంది. దీంతో గవర్నర్ రోడ్డు మార్గంలోనే మేడారానికి వెళ్లారు.
