వికారాబాద్ జిల్లా చిలాపూర్ కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో మూడో తరగతి విద్యార్ధి అనుమానాస్పద మృతి కేసు కలకలం రేపుతోంది. కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందాదని బాబు తండ్రి కన్నీటి పర్యంత మయ్యారు.
వికారాబాద్ జిల్లా చిలాపూర్ కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో మూడో తరగతి విద్యార్ధి అనుమానాస్పద స్థితిలో మరణించడం కలకలం రేపుతోంది. ఈ నేపథ్యంలో మృతుడు కార్తీక్ తండ్రి కేశవరెడ్డి యాజమాన్యంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 20 రోజుల క్రితం మా బాబును కొట్టారని ఆయన ఆరోపించాడు. బెడ్ పై నుంచి పడ్డానని బాబు చెప్పాడని.. కానీ ఎక్స్‌రేలో మాత్రం కుడి చేయి విరిగినట్లు డాక్టర్లు చెప్పారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా లంగ్స్‌లో సైతం ఇన్‌ఫెక్షన్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. నిన్న ఊపిరి పీల్చుకునేందుకు కూడా బాబు బాగా ఇబ్బంది పడ్డాడని చిన్నారి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తన కుమారుడు మృతి చెందాదని ఆయన కన్నీటి పర్యంత మయ్యారు.
కాగా.. మొయినాబాద్ మండలం పెద్ద మంగలారంకు చెందిన కార్తీక్ చిలాపూర్‌లోని కేశవరెడ్డి రెసిడెన్షియల్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్నాడు. అయితే సాత్విక్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. తన కొడుకుని టీచర్ కొట్టడంతోనే అస్వస్థతకు గురై మృతి చెందాడంటూ చెన్గోమల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చదవు కోసం స్కూల్‌కు పంపితే టీచర్ ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే కార్తీక్‌ను టీచర్ కొట్టారనే వార్తలపై స్పందించిన కేశవరెడ్డి స్కూల్ యాజమాన్యం.. సాత్విక్ బెడ్‌పై నుంచి పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారని చెబుతున్నారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు.
