విషాదంగా ముగిసిన ఇందు మిస్సింగ్: హైద్రాబాద్ దమ్మాయిగూడ చెరువులో విద్యార్ధిని డెడ్‌బాడీ లభ్యం

నిన్న అదృశ్యమైన నాలుగో తరగతి  విద్యార్ధిని  ఇందు మృతి చెందింది.  దమ్మాయిగూడ చెరువులో 10 ఏళ్ల విద్యార్ధిని  ఇందు డెడ్ బాడీని  ఇవాళ గుర్తించారు. 
 

Class  Fourth Student  Indu  dead Found  at  Dammaiguda  lake  in hyderabad

హైదరాబాద్: నిన్న అదృశ్యమైన నాలుగో తరగతి విద్యార్ధిని  ఇందు   మృతి చెందింది.  దమ్మాయిగూడ చెరువులో బాలిక  మృతదేహం శుక్రవారం నాడు  గుర్తించారు. ఇందు  మృతదేహన్ని చూసిన పేరేంట్స్ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నిన్న ఉదయం దమ్మాయిగూడ ప్రభుత్వ స్కూల్ వద్ద 10 ఏళ్ల  విద్యార్ధిని  ఇందును తండ్రి  వదిలివెళ్లాడు. అయితే  స్కూల్ ప్రారంభం కాకముందే  స్కూల్ నుండి విద్యార్ధిని ఇందు  బయటకు వెళ్లింది.  అయితే స్కూల్ లో  హాజరు తీసుకొనే సమయంలో  ఇందుకు చెందిన  బ్యాగు, పుస్తకాలను  గుర్తించిన టీచర్  ఇందు తండ్రికి  పోన్ చేశాడు. స్కూల్ కు వచ్చిన  తండ్రి, కుటుంబ సభ్యులు, స్కూల్ టీచర్లు  బాలిక కోసం వెతికారు.  అయినా కూడా ఆమె ఆచూకీ లభ్యం  కాలేదు. అయితే  ఇవాళ  ఉదయం కూడా  ఇందు ఆచూకీని కనిపెట్టాలని కోరుతూ  ఆందోళనకు దిగారు. అయితే  ఇవాళ ఉదయం  దమ్మాయిపేట చెరువు వద్ద  బాలిక డెడ్ బాడీని వెలికితీశారు పోలీసులు.  

నిన్న ఉదయం దమ్మాయిగూడ ప్రభుత్వ స్కూల్ వద్ద 10 ఏళ్ల  విద్యార్ధిని  ఇందును తండ్రి  వదిలివెళ్లాడు. అయితే  స్కూల్ ప్రారంభం కాకముందే  స్కూల్ నుండి విద్యార్ధిని ఇందు  బయటకు వెళ్లింది.  అయితే స్కూల్ లో  హాజరు తీసుకొనే సమయంలో  ఇందుకు చెందిన  బ్యాగు, పుస్తకాలను  గుర్తించిన టీచర్  ఇందు తండ్రికి  పోన్ చేశాడు. స్కూల్ కు వచ్చిన  తండ్రి, కుటుంబ సభ్యులు, స్కూల్ టీచర్లు  బాలిక కోసం వెతికారు.  అయినా కూడా ఆమె ఆచూకీ లభ్యం  కాలేదు. అయితే  ఇవాళ  ఉదయం కూడా  ఇందు ఆచూకీని కనిపెట్టాలని కోరుతూ  ఆందోళనకు దిగారు. అయితే  ఇవాళ ఉదయం  దమ్మాయిపేట చెరువు వద్ద  బాలిక డెడ్ బాడీని వెలికితీశారు పోలీసులు.  విద్యార్ధిని ఇందు మృతదేహన్ని  గాంధీ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.  విద్యార్ధిని తండ్రిని కూడా  ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు పోలీసులు.  నిన్న పోలీసులు సీసీటీవీ పుటేజీని పరిశీలించిన సమయంలో  విద్యార్ధిని  చెరువు కట్ట వైపునకు  వెళ్లిన దృశ్యాలను పోలీసులు గుర్తించారు.

also read:దమ్మాయిగూడ స్కూల్ నుండి విద్యార్ధిని మిస్సింగ్: ఇందు ఆచూకీ కోసం పేరేంట్స్ ఆందోళన

బాలిక స్కూల్  నుండి  ఒంటరిగానే చెరువు  వైపునకు వెళ్లింది.  బాలిక ప్రమాదవశాత్తు  చెరువులో పడిందా, లేదా ఎవరైనా బాలికను   చెరువులో పడేశారా అనే  విషయమై  పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.   ఈ  చెరువు ప్రాంతంలో  కొందరు గంజాయి  తాగుతుంటారని  స్థానిక మహిళలు ఆరోపిస్తున్నారు.  నిన్న  మధ్యాహ్నం చెరువు ప్రాంతంలో  ముగ్గురు కూర్చుని ఉన్నారని  స్థానికులు  చెబుతున్నారు.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios