ఆనందంగా.. ఉత్సాహంగా జరుపుకోవాల్సిన నూతన సంవత్సర వేడుకలను కొందరు హింసాత్మకంగా మార్చేశారు. కత్తులతో ఒకరిని మరొకరు పొడిచుకొని రక్తపాతం సృష్టించారు. ఈ సంఘటన  ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో నూతన సంవత్సర వేడుకల్లో చోటుచేసుకుంది.

ఉట్నూర్ మండల కేంద్రంలోని బోయవాడలో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటున్న యువకులు ఒకరిపై మరొకరు కత్తులతో దాడికి తెగబడ్డారు.

ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. చిత్స నిమిత్తం ఇద్దరినీ ఆదిలాబాద్ రిమ్స్‌కి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాాల్సి ఉంది.