Asianet News TeluguAsianet News Telugu

భూవివాదం: కొట్టుకొన్న రెండు వర్గాలు, పలువురికి గాయాలు

 ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో మూడు ఎకరాల భూమి విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో రెండు వర్గాలు కర్రలు, గొడళ్లతో దాడులకు దిగారు. 

clashes between two groups in ravikampahad over land issue
Author
Khammam, First Published Apr 22, 2019, 2:29 PM IST

ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామంలో మూడు ఎకరాల భూమి విషయంలో రెండు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో రెండు వర్గాలు కర్రలు, గొడళ్లతో దాడులకు దిగారు. 

చండ్రుగొండ మండలం రావికంపాడు గ్రామానికి చెందిన చెరుపల్లి కోదండరామారావు 1969లో మూడు ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ స్థలంలో ఇల్లును కూడ కట్టుకొన్నారు. కోదండరామారావు కొడుకు శ్రీరామచంద్రమూర్తి ప్రస్తుతం అస్ట్రేలియాలో నివాసం ఉంటున్నారు.

అయితే  సాదా బై నామా విషయమై శ్రీరామచంద్రమూర్తి ధరఖాస్తు చేసుకొన్నాడు. దీంతో స్థానిక వీఆర్ఓ వివాదాన్ని లేవనెత్తాడు. అయితే గ్రామస్తులంతా ఈ భూమి శ్రీరామచంద్రమూర్తి కుటుంబానికే చెందుతోందని తీర్మానం చేశారు.

కానీ  ఇవాళ శ్రీరామచంద్రమూర్తి వర్గీయులు వీఆర్ఓ‌తో పాటు మరో 10 మంది గొడవకు దిగారు.  కర్రలు, కత్తులు, రాళ్లతో కొట్టుకొన్నారు.  ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి.విషయం  తెలిసిన వెంటనే పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకొని  ఇరువర్గాలను చెదరగొట్టారు. అసలు గొడవకు కారణాలేమిటనే విషయమై దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios