రాజేంద్రనగర్: రాజేంద్రనగర్  అసెంబ్లీ నియోజకవర్గంలోని మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ వద్ద టీఆర్ఎస్ రెబెల్ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి గురువారం నాడు ధర్నాకు దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.

రాజేంద్ర‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి తోకల శ్రీనివాస్ రెడ్డి టీఆర్ఎస్ టికెట్టు ఆశించారు. ప్రకాష్ గౌడ్ కు టికెట్టు దక్కడంతో  శ్రీనివాస్ రెడ్డి రెబెల్‌గా బరిలో నిలిచారు.

గురువారం నాడు శ్రీనివాస్ రెడ్డి వర్గీయులపై టీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాష్ గౌడ్  వర్గీయులు దాడికి దిగారు. ఇన్నోవా కారును ధ్వంసం చేశారు. ఈ ఘటనలో  ముగ్గురు శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలకు  గాయాలయ్యాయి.

దాడికి పాల్పడిన ప్రకాష్ గౌడ్ వర్గీయులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తోకల శ్రీనివాస్ రెడ్డితో పాటు ఆయన వర్గీయులు  మైలార్‌దేవుపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు.  దీంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.